Manasantha Nuvve: 20 ఏళ్ల ఎవర్‌గ్రీన్‌ ప్రేమకథా చిత్రం ‘మనసంతా నువ్వే’!

మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమకథా చిత్రాల జాబితా చూస్తే అందులో మనసంతా నువ్వే ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక ప్రేమ కథా సినిమానే కాదు. ఓ సాధారణ కుర్రాడిని..

Manasantha Nuvve: 20 ఏళ్ల ఎవర్‌గ్రీన్‌ ప్రేమకథా చిత్రం ‘మనసంతా నువ్వే’!

Manasantha Nuvve

Updated On : October 19, 2021 / 4:09 PM IST

Manasantha Nuvve: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమకథా చిత్రాల జాబితా చూస్తే అందులో మనసంతా నువ్వే ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక ప్రేమ కథా సినిమానే కాదు. ఓ సాధారణ కుర్రాడిని స్టార్ హీరోను చేసిన సినిమా.. అంతకు ముందు రెండు మూడు సినిమాలలో ఘోరంగా నష్టపోయి ఉన్న ఓ నిర్మాతకి పదింతలు లాభాలు తెచ్చి మరో నాలుగు సినిమాలు నిర్మించేందుకు అండగా నిలిచిన సినిమా మనసంతా నువ్వే.

sankranti 2022: ఇప్పటికే టఫ్‌ఫైట్.. అయినా బంగార్రాజు సై?

సింపుల్ కథే కానీ.. అది చెప్పిన తీరు.. దానికి అద్దిన హంగులు.. కథలో భావం నటీనటుల మోములో కనిపించిన తీరుకి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యాడు. ఫలితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దర్శకుడు వి.ఎన్‌ ఆదిత్య అద్భుతంగా చిత్రీకరించిన ఈ సినిమా నేటితో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో నటించిన ఉదయ్ కిరణ్‌, రీమాసేన్‌ తర్వాత భారీ ఆఫర్లు అందుకొని స్టార్ స్టేటస్ అందుకోగా.. ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ ఆల్బమ్ గా నిలిచింది. ఆర్‌పి పట్నాయక్‌ అందించిన మ్యూజిక్‌ ఇప్పటికీ గుర్తుండిపోతుంది.

Chiranjeevi Website: మెగా వెబ్‌సైట్‌లో తప్పులు.. మినిమం జాగ్రత్త లేదా?

ఈ సినిమాకు ముందు నిర్మాత ఎంఎస్ రాజు ‘దేవీ పుత్రుడు’ సినిమాతో ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి ఉన్నాడు. అంతకు ముందు రెండు సినిమాలు కూడా నష్టాలే మిగిల్చినా దేవిపుత్రుడు కోలుకోనేని దెబ్బతీసింది. ఓ సమయంలో ఓ పాత సినిమా చూస్తుండగా అందులో ప్రేమికులు ఏళ్ల తరబడి కలుసుకునేందుకు ఎదురు చూడడం అనే పాయింట్ నచ్చిన నిర్మాత రాజు కథను సిద్ధం చేయాలని పరుచూరి బ్రదర్స్ ను కలిశారు.

Telugu Young Directors: స్టార్ హీరోలను ఫిదా చేస్తున్న యంగ్ డైరెక్టర్స్..!

నిర్మాత రాజు, రచయితలు పరుచూరి బ్రదర్స్ కలిసి, కెమెరామెన్ ఎన్ గోపాల్ రెడ్డి కలిసి ఈ కథను దర్శకుడు వీఎం ఆదిత్యకి అప్పగించారు. మే 10 రాజు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను మొదలు పెట్టి, జూన్ 1 నుంచి షూటింగ్ మొదలు పెట్టారు. అంతా కలిసి ఈ సినిమాకు అద్భుతమైన రూపం తీసుకురాగా అనుకున్న కథను ఆదిత్య అదే భావంతో తెరకెక్కించాడు. నిండా నాలుగు నెలలు తిరగకుండానే అక్టోబర్ 19న మనసంతా నువ్వే థియేటర్లలోకి వచ్చింది.

Telugu New Films: కెమెరా.. యాక్షన్.. కొత్త సినిమా స్టార్ట్!

కథ మీద నమ్మకంతోనే ఈ సినిమా కోసం భారీ ఆఫర్లు వచ్చినా నిర్మాత రాజు సొంతంగా విడుదల చేశారు. తన నమ్మకం ఒమ్ము కాలేదు. అందుకున్నట్లే ఆయనకు ‘మనసంతా నువ్వే’ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిందని తెలిపారు. కేవలం రూ.1.3 కోట్లతో తీసిన సినిమా అప్పట్లోనే రూ.16 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ ఆశ్చర్యపడేలా చేసింది. నిర్మాత ప్రతి ఏడాది ఈరోజున ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో తన భావాన్ని షేర్ చేసుకుంటారు. ఈ ఏడాది కూడా ఇరవై ఏళ్ల ఈ ప్రేమ చిత్రం తన జీవితంలో తెచ్చిన మలుపు గురించి గుర్తుచేసుకున్నారు.