Raviteja Ravanasura Movie : రవితేజ సినిమా కోసం 5 కోట్లతో సెట్.. భారీగా ప్లాన్ చేస్తున్న రావణాసుర..

రావణాసుర సినిమాలో రవితేజ లాయర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ సీన్ కోసం అయిదు కోట్లతో భారీ సెట్ ని నిర్మించబోతున్నట్టు........

Raviteja Ravanasura Movie : రవితేజ సినిమా కోసం 5 కోట్లతో సెట్.. భారీగా ప్లాన్ చేస్తున్న రావణాసుర..

A big set worth 5 crores for Raviteja Ravanasura Movie Climax Scene

Updated On : August 30, 2022 / 11:23 AM IST

Raviteja Ravanasura Movie :  రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. ప్రస్తుతం రావణాసుర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. సుధీర్‌ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న రావణాసుర సినిమాలో ఏకంగా అయిదుగురు హీరోయిన్స్ ని తీసుకున్నారు. అను ఇమ్మానియేల్‌, మేఘా ఆకాశ్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్‌, పూజిత పొన్నాడ లు హీరోయిన్స్‌గా తీసుకోవడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇందులో సుశాంత్ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు.

MegaStar Chiranjeevi : చిన్న సినిమాకి ‘మెగా’ సాయం.. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా మెగాస్టార్..

రావణాసుర సినిమాలో రవితేజ లాయర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ సీన్ కోసం అయిదు కోట్లతో భారీ సెట్ ని నిర్మించబోతున్నట్టు సమాచారం. హైదరాబాద్ లోనే ఈ సెట్ ని ఆర్ట్ డిపార్ట్మెంట్ గ్రాండ్ గా నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం క్లైమాక్స్ కోసం 5 కోట్లతో సెట్ వేస్తున్నారంటే ఏదో గ్రాండ్ గానే ప్లాన్ చేశారని అభిమానులు భావిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.