Big Boss 5: కాస్త ఎమోషన్..ఇంకాస్త రొమాంటిక్‌.. ప్రేమ పక్షుల గోరుముద్దలు!

తెలుగు బుల్లితెరపై బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ మూడవ వారం దిగ్విజయంగా జరుగుతుంది. శుక్రవారం జరిగిన 20వ ఎపిసోడ్ లో ఫన్ మూమెంట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, అలకలు, గొడవలు కనిపించాయి.

Big Boss 5: కాస్త ఎమోషన్..ఇంకాస్త రొమాంటిక్‌.. ప్రేమ పక్షుల గోరుముద్దలు!

Big Boss 5

Updated On : September 25, 2021 / 7:17 AM IST

Big Boss 5: తెలుగు బుల్లితెరపై బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ మూడవ వారం దిగ్విజయంగా జరుగుతుంది. శుక్రవారం జరిగిన 20వ ఎపిసోడ్ లో ఫన్ మూమెంట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, అలకలు, గొడవలు కనిపించాయి. ఇంటి సభ్యులు లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో పాల్గొంటూనే ఆటను రక్తి కట్టించగా నటరాజ్ మాస్టర్ భార్య సీమంతం వేడుక ఇంటి సభ్యులను ఎమోషనల్‌గా మార్చింది. నటరాజ్ మాస్టర్ తన భార్య సీమంతం వేడుకను చూసి ఎమోషనల్ కాగా.. ఇంటి సభ్యులంతా ఆయన్ని ఓదార్చి.. ఛాన్స్ దొరికినపుడు ప్రేమ పక్షుల రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోయారు.

Big Boss 5: ప్రేమ కథలు, బ్రేకప్ స్టోరీలు.. ఎమోషనల్‌గా మారిన ఎపిసోడ్

లగ్జరీ బడ్జెట్ టాస్క్ అతికిందంటే అదృష్టమే గేమ్ జరగగా.. ఇంటిలో వెల్ గ్రోతో కూడిన ప్లాస్టిక్ కర్టెన్ పెట్టారు. ఇంటి సభ్యులందరూ ఉత్సాహంతో గేమ్ అడ్డాగా మానస్ కొట్టిన ఎక్కువ బంతులు కర్టెన్‌కు అంటుకోవడంతో అతనే గెలిచాడు. ఇక ఇక మానస్, హమీదా మధ్య రొమాంటిక్ సన్నివేశం ఇంట్లో కాస్త అగ్గి రాజేసింది. హమీదాకు మానస్ కోడిగుడ్లుతో ప్రేమగా గోరుముద్దలు తినిపించగా అందరూ వారిద్దరిని ఆటపట్టించారు. వీరి రొమాంటిక్ సీన్ చూసి ప్రియాంక జెలసీగా ఫీలవగా.. దాన్ని జైల్లో ఉన్న మానస్ వద్ద పింకీ వెళ్లగక్కేసింది.

Big Boss 5: ఏడుగురిని గొర్రెలుగా చేసిన హౌస్‌లోకి వచ్చిన ఓ గుంట నక్క!

గతవారం ఇంటిలో జరిగిన టాస్క్‌లలో వరస్ట్ పెర్ఫార్మర్‌ మానస్‌కు బిగ్‌బాస్ జైలుశిక్షను విధించడంతో జైలులో పెట్టి శిక్ష అమలు చేశారు. ప్రియాంక జైల్లో ఉన్న మానస్ వద్దకు వెళ్లి మూడుసార్లు హమీదాకు అన్నం ఎలా తినిపిస్తావో చూస్తాను. ఆ కోతి ముఖం దానికి అన్నం తినించడం ఎందుకు అంటూ ప్రియాంక కుళ్లుకుంటూ మానస్‌పై ప్రేమను ప్రియాంక బయటపెట్టింది. ఇక ప్రియాంక, లోబో, యాంకర్ రవి మధ్య సరదాగా సంభాషణ జరిగింది. పింకీ ఒకప్పుడు ఎలా ఉండేది.. ఇప్పడు ఇంత అందంగా తయారైందో చూడు.. ఆ కళ్లు.. ముక్కు అంటూ ప్రియాంకను ఆటపట్టించగా ప్రియాంక కోతలు కోసింది. దీంతో లోబో ఆమె ముఖంపై గ్యాస్ వదలడంతో ముక్కు, మూతి మూసుకొని ప్రియాంక పరుగులుపెట్టింది.