Ira Khan : ఆటోలో ప్రయాణించిన అమీర్ ఖాన్ కూతురు.. వీడియో వైరల్..
కొన్ని నెలల క్రితమే తన బాయ్ ఫ్రెండ్ నుపుర్ శిఖరేతో నిశ్చితార్థం కూడా అయింది ఇరా ఖాన్ కి. ఇటీవలే IIFA అవార్డ్స్ లో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఇరా.

Aamir Khan Daughter Ira Khan travelled in Auto with her friend at Mumbai
Ira Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురిగా ఇరా ఖాన్ అందరికి పరిచయమే. తన సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలతో బాగా పాపులారిటీ తెచ్చుకుంది ఇరా ఖాన్. గతంలో పలువురు ఇరా ఖాన్ సోషల్ మీడియా పోస్టులకు ట్రోల్స్ కూడా చేశారు. దీంతో ఇరా బాగా పాపులర్ అయింది. కొన్ని నెలల క్రితమే తన బాయ్ ఫ్రెండ్ నుపుర్ శిఖరేతో నిశ్చితార్థం కూడా అయింది ఇరా ఖాన్ కి. ఇటీవలే IIFA అవార్డ్స్ లో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఇరా.
తాజాగా ఇరా ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచిని. సోమవారం సాయంత్రం ఇరా ఖాన్ మరియు ఆమె స్నేహితురాలు కలిసి ముంబైలో ఆటోలో ప్రయాణించారు. దీంతో స్టార్ కిడ్ అయి ఉండి కూడా ఇరా ఖాన్ ఇలా ఆటోలో ప్రయాణించడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఆటోలో వెళ్తూ కెమెరాకు హాయ్ చెప్పింది ఇరా. దీంతో పలువురు నెటిజన్లు సింపుల్ స్టార్ కిడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల బాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు ముంబైలో ఆటోలో, లోకల్ ట్రైన్ లో, బైక్ మీద వెళ్తూ ఇలా సందడి చేస్తున్నారు.