Aamir Khan Corona Positive: అమీర్ ఖాన్‌కు కరోనా పాజిటివ్!

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. కోవిడ్-19 బారిన పడిన తరువాత, అమీర్ ఖాన్ హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు.

Aamir Khan Corona Positive: అమీర్ ఖాన్‌కు కరోనా పాజిటివ్!

Aamir Khan Corona

Updated On : March 24, 2021 / 1:36 PM IST

Aamir Khan Corona Positive: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. కోవిడ్-19 బారిన పడిన తరువాత, అమీర్ ఖాన్ హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు. కోవిడ్ వచ్చిన తర్వాత.. కరోనా నియమాలను పాటిస్తున్నట్లుగా అమీర్ ఖాన్ పీఏ ధృవీకరించారు.

“అమీర్ ఖాన్ కోవిడ్ -19 టెస్ట్ పాజిటివ్‌గా వచ్చింది. అతను ప్రస్తుతం తన ఇంట్లో నిర్బంధంలో ఉన్నాడు మరియు అన్ని నియమాలను పాటిస్తున్నాడు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇటీవల అమీర్ ఖాన్ గారితో సంప్రదించిన వారెవరైనా, ముందుజాగ్రత్తగా పరీక్షలను చేసుకోవాలని,” అమీర్ ఖాన్ పీఏ చెప్పారు.

గతేడాది అమీర్ ఖాన్‌తో కలిసి పనిచేస్తున్న 7 మంది ఉద్యోగులు, వారి భద్రతా సిబ్బంది, డ్రైవర్లు మరియు గృహనిర్వాహకులతో సహా కరోనా పాజిటివ్‌గా గుర్తించగా.. అప్పుడు అమీర్ ఖాన్‌కు మాత్రం నెగెటివ్ వచ్చింది. పలుమార్లు టెస్ట్ చేయించుకున్న తర్వాత అమీర్ ఖాన్‌కు నెగెటివ్ వచ్చింది. అయితే ఇప్పుడు వరుసగా బాలీవుడ్ ప్రముఖులు రణబీర్ కపూర్, సంజయ్ లీలా భన్సాలీ, కార్తిన్ ఆర్యన్, సంజయ్ లీలా భన్సాలీ, వరుణ్ ధావన్, నీతు సింగ్ కూడా కరోనా పాజిటివ్‌గా గుర్తించారు.

మార్చి 14 న తన 56వ పుట్టినరోజును అమీర్ ఖాన్ చేసుకున్నారు. అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చాధా’ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 24, 2021 న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం గత సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా విడుదల ఆలస్యం అవుతోంది.