Ira Khan Wedding : కూతురు పెళ్లిలో అమీర్ ఖాన్ ఇద్దరు భార్యల సందడి
ఐరా ఖాన్-నూపుర్ శిఖరేలు ఈరోజు పెళ్లి పీటలెక్కబోతున్నారు. పెళ్లికి ముందు మంగళవారం జరిగిన హల్దీ వేడుకల్లో అమీర్ ఖాన్ ఇద్దరు మాజీ భార్యలు సందడి చేసారు.

Ira Khan Wedding
Ira Khan Wedding : బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తన చిరకాల ప్రియుడు నూపుర్ శిఖరేని జనవరి 3 న పెళ్లాడబోతున్నారు. తాజాగా మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అమీర్ ఖాన్ ఇద్దరు భార్యలు సందడి చేసారు.
Anjali Patil : సైబర్ కేటుగాళ్లకి చిక్కి లక్షలు మోసపోయిన నటి.. మరీ ఇంత అమాయకంగా
ఐరా ఖాన్, నూపుర్ శిఖరే జనవరి 3 అంటే ఈరోజు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో వీరి వివాహం జరగబోతోంది. మంగళవారం సాయంత్రం హల్దీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు అమీర్ ఖాన్ మాజీ భార్యలు హాజరయ్యారు. మొదటి భార్య రీనా దత్తా కూతురే ఐరా ఖాన్, కొడుకు జునైద్. కాగా రెండవ భార్య కిరణ్ రావు కొడుకు ఆజాద్ కూడా ఈ వేడుకలలో సందడి చేసారు. గతేడాది నవంబర్ 18 న ఐరా ఖాన్, నూపుర్ శిఖరేలకు నిశ్చితార్ధం జరిగింది.
హల్దీ వేడుకలలో అమీర్ ఖాన్ సాధారణ దుస్తులు ధరించి సింపుల్‌గా కనిపించారు. వరుడు నూపుర్ శిఖరే ఇంట్లో జరిగిన మెహందీ ఫంక్షన్ వేడుకల్లో అంతా మహారాష్ట్ర సంప్రదాయంలో చీరలు ధరించి కనిపించారు. బనారస్, లక్నో నుండి వచ్చిన బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాతో ఉన్న పిల్లల్లో ఐరా చిన్నది. రెండవ భార్య కిరణ్ రావుతో 15 సంవత్సరాలు వైవాహిక బంధానికి గుడ్ బై చెబుతూ 2021 జూలైలో అమీర్ విడాకులు తీసుకున్నారు. వీరిద్దరి కొడుకు జునైద్ ‘మహరాజ్’ అనే ప్రాజెక్టుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీనిని యష్ రాజ్ ఫిల్మ్స్ మరియు నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్నాయి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram