Aamir khan : ధూమ్ 4లో అమీర్ ఖాన్? అమీర్ కి ఇప్పుడు హిట్ కావాలంటే ధూమ్ 4 చేయాల్సిందేనా?
‘ధూమ్ 3’ లో అమీర్ ఖాన్ దొంగగానూ, మెజీషియన్ గానూ డ్యూయల్ రోల్స్ చేశాడు. రెండు పాత్రల్లోనూ అమీర్ అదరగొట్టేశాడు. అందుకే నాలుగో భాగంలో కూడా ఆ పాత్రల్నే కంటిన్యూ చేయాలని యశ్ రాజ్ ఫిల్మ్స్ భావిస్తున్నారట.

Aamir Khan will play lead role in Dhoom 4 news goes viral in Bollywood
Aamir khan : బాలీవుడ్(Bollywood) సూపర్ హిట్ ఫ్రాంచైజీస్ లో ధూమ్(Dhoom) ఒకటి. దొంగ పోలీస్ కాన్సెప్ట్ తో ఈ సిరీస్ లో వచ్చిన మూడు సినిమాలూ బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) మూడు సినిమాల్లోనూ పోలీసాఫీసర్ గా నటించగా.. ఫస్ట్ పార్ట్ లో జాన్ అబ్రహం(John Abraham), సెకండ్ పార్ట్ లో హృతిక్ రోషన్(Hritik Roshan), మూడో సినిమాలో అమీర్ ఖాన్(Aamir Khan) దొంగలుగా నటించి.. బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నారు. నాలుగో పార్ట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఈ సిరీస్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రస్తుతం స్పై యూనివర్స్ సినిమాలతో బిజీగా ఉండటంతో ధూమ్ 4 మూవీని తీయడానికి ఇంకా టైమ్ పట్టవచ్చని బాలీవుడ్ కొంతమంది అంటున్నారు. అయితే ఇందులో దొంగ పాత్రలో ఎవరు నటిస్తారు అనేది ఆసక్తిగా మారింది. దానికి తగ్గట్టుగానే బాలీవుడ్ లో ఓ అప్డేట్ వినిపిస్తోంది. ధూమ్ 4లో కూడా అమీర్ ఖాన్ దొంగ పాత్రను కంటిన్యూ చేస్తాడని సమాచారం.
‘ధూమ్ 3’ లో అమీర్ ఖాన్ దొంగగానూ, మెజీషియన్ గానూ డ్యూయల్ రోల్స్ చేశాడు. రెండు పాత్రల్లోనూ అమీర్ అదరగొట్టేశాడు. అందుకే నాలుగో భాగంలో కూడా ఆ పాత్రల్నే కంటిన్యూ చేయాలని యశ్ రాజ్ ఫిల్మ్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లోని సినిమాలపై కాన్సన్ ట్రేట్ చేసినా ధూమ్ 4 సినిమా మాత్రం ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు.
ప్రస్తుతం అమీర్ వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్నాడు. అప్పుడెప్పుడో 2017 లో సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తో అమీర్ వి రెండు సినిమాలు వచ్చినా ఆ రెండూ పరాజయం పాలయ్యాయి. ఇటీవల వచ్చిన లాల్ సింగ్ చద్దా సినిమా కూడా పరాజయం పాలవ్వడంతో సినిమాలకు కొంచెం గ్యాప్ తీసుకుంటానని ప్రకటించాడు. ప్రస్తుతం అమీర్ ఏ సినిమా చేయట్లేదు. ఇలాంటి టైంలో ధూమ్ 4 గురించి టాక్ రావడంతో అమీర్ అభిమానులు సంతోషిస్తున్నారు. ధూమ్ 4లో అమీర్ చేస్తే ఈ సినిమా అమీర్ కి కచ్చితంగా హిట్ ఇస్తుందని అభిమానులు అంటున్నారు. మరి ధూమ్ 4 సినిమాలో అమీర్ నటిస్తాడా? అసలు ధూమ్ 4 ఇప్పుడు మొదలవుతుందా అంటే వెయిట్ చేయాల్సిందే. ధూమ్ 3 వచ్చి పదేళ్లు అవుతుంది. మరి ఇంత గ్యాప్ తర్వాత ధూమ్ 4 వస్తే ప్రేక్షకులు కూడా ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.