Actress Abhinaya : కాబోయే భర్త ని పరిచయం చేసిన హీరోయిన్.. ఫోటోలు వైరల్..

త‌నకు కాబోయే భ‌ర్త‌ను అంద‌రికి ప‌రిచ‌యం చేసింది అభిన‌య.

Actress Abhinaya : కాబోయే భర్త ని పరిచయం చేసిన హీరోయిన్.. ఫోటోలు వైరల్..

Abhinaya introduces her future husband And Shares Her Engagement Photo

Updated On : March 29, 2025 / 12:35 PM IST

న‌టి అభిన‌య గురించి తెలుగు వారికి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ‘ధ్రువ’, ‘శంభో శివ శంభో’,’సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటిసినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ద‌గ్గ‌ర అయ్యారు. ఈ న‌టి త్వ‌ర‌లోనే వివాహ బంధంలోకి అడుగుపెట్ట‌నుంది. ఇటీవ‌లే ఆమెకు నిశ్చితార్థం జ‌రిగింది.

కాబోయే భ‌ర్త‌తో క‌లిసి గంట కొడుతున్న ఫోటోని షేర్ చేసి.. త‌న‌కు నిశ్చితార్థం జ‌రిగిన‌ట్లుగా సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిన‌య తెలియ‌జేసింది. అయితే.. ఆమె త‌నకు కాబోయే భ‌ర్త ముఖాన్ని చూపించ‌లేదు. అత‌డు పేరు ఏంటి, ఏం చేస్తాడు అన్న విష‌యాల‌ను వెల్ల‌డించ‌లేదు. ఏ రోజు నిశ్చితార్థం జ‌రిగింది? అన్న‌ది చెప్ప‌లేదు.

తాజాగా త‌నకు కాబోయే భ‌ర్త‌ను అంద‌రికి ప‌రిచ‌యం చేసింది. మార్చి 9న త‌న ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన‌ట్లు చెప్పుకొచ్చింది. త‌నకు కాబోయే భ‌ర్తతో దిగిన ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. అయితే.. అత‌డి పేరును మాత్రం చెప్ప‌లేదు.

Mad Square : ‘మ్యాడ్ స్క్వేర్’ ఫ‌స్ట్‌డే క‌లెక్ష‌న్ ఎంతంటే..?

కాగా.. న‌టి షేర్ చేసిన ఫోటోల‌ను బ‌ట్టి అత‌డి పేరు కార్తీక్‌గా తెలుస్తోంది. అత‌డి సోష‌ల్ మీడియా పేజీలో అత‌డి పేరు స‌న్నీ వ‌ర్మ‌6గా ఉంది. అత‌డు ఎక్క‌డి వాడు, ఏం చేస్తాడు అన్న విష‌యాలు ప్ర‌స్తుతానికి తెలియ‌వు. అత‌డి గురించి నెటిజ‌న్లు సెర్చ్ మొద‌లుపెట్టారు.

 

View this post on Instagram

 

A post shared by M.g Abhinaya (@abhinaya_official)