Raviteja : టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్‌లో గాయపడ్డ రవితేజ.. ఏకంగా 12 కుట్లు..

టైగర్ నాగేశ్వరరావు సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది. రవితేజ మొదటి సారి పీరియాడిక్ సినిమా చేయడం, భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం, స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో తీయడం.. ఇవన్నీ సినిమాపై అంచనాలను నెలకొల్పాయి.

Raviteja : టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్‌లో గాయపడ్డ రవితేజ.. ఏకంగా 12 కుట్లు..

Abhishek Agarwal said Raviteja Injured in Tiger Nageswara Rao Movie Shooting

Updated On : October 13, 2023 / 9:55 AM IST

Raviteja :  మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) ద‌ర్శ‌కుడు వంశీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’(Tiger Nageswararao). అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకం పై పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ‌లు నుపూర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj) హీరోయిన్స్ గా నటిస్తుంటే.. రేణూ దేశాయ్‌, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. జీవి ప్ర‌కాశ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

టైగర్ నాగేశ్వరరావు సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది. రవితేజ మొదటి సారి పీరియాడిక్ సినిమా చేయడం, భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం, స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో తీయడం.. ఇవన్నీ సినిమాపై అంచనాలను నెలకొల్పాయి. ఇక ఇప్పటికే రిలీజయిన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో రవితేజ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.

అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. రవితేజ సినిమాలో ట్రైన్ దోపిడీ సీన్ చేస్తుప్పుడు ట్రైన్ మీద నుంచి లోపలి దూకే షాట్ ఉంటుంది. ఆ షాట్ లో అదుపు తప్పి కింద పడ్డారు. మోకాలికి కొద్దిగా పైన బాగా దెబ్బ తగిలింది. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాం. ఆపరేషన్ చేసి 12 కుట్లు వేశారు. ఆ షాట్ లో దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. షూట్ ఎక్కువ రోజులు వాయిదా వేస్తే నిర్మాతకు నష్టం అని ఆలోచించి రెండు రోజుల్లో మళ్ళీ షూట్ కి వచ్చారు. పూర్తిగా నయమయ్యేదాకా రెస్ట్ తీసుకోమని నేను, డైరెక్టర్ చెప్పినా బడ్జెట్ పెరిగిపోతుందని షూట్ కి వచ్చేశారు. సినిమాపై ఆయనకు అంత డెడికేషన్ ఉంది అని అన్నారు.

Also Read : Manchu Lakshmi : బాలీవుడ్ లో బిజీ కాబోతున్న మంచు లక్ష్మి.. ముంబైకి షిఫ్ట్..

దీంతో రవితేజపై మరోసారి అందరూ అభినందనలు కురిపిస్తున్నారు. ఎంతో కష్టపడి, ఎవరూ లేకుండా రవితేజ ఇవాళ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన సంగతి తెలిసిందే. సినిమా కోసం రవితేజ ఎంతైనా కష్టపడతాడు. మరోసారి సినిమాపై తనకున్న ప్రేమని ఇలా చూపించి అందరికి నచ్చే మాస్ మహారాజ అనిపించుకున్నాడు.