Krishna Chaitanya : ‘మనోజ్ఞ’ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా యువ న‌టుడు కృష్ణ చైత‌న్య‌

యువ న‌టుడు కృష్ణ చెత‌న్య (Krishna Chaitanya) రోట‌రీ క్ల‌బ్‌తో చేతులు క‌లిపారు. ఆ సంస్థ నిర్వ‌హిస్తున్న మనోజ్ఞ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఎంపిక‌య్యారు.

Krishna Chaitanya : ‘మనోజ్ఞ’ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా యువ న‌టుడు కృష్ణ చైత‌న్య‌

Krishna Chaitanya Brand Ambassador For Manogna

Updated On : August 16, 2023 / 7:59 PM IST

Krishna Chaitanya-Manogna : యువ న‌టుడు కృష్ణ చెత‌న్య (Krishna Chaitanya) రోట‌రీ క్ల‌బ్‌తో చేతులు క‌లిపారు. ఆ సంస్థ నిర్వ‌హిస్తున్న ‘మనోజ్ఞ’ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఎంపిక‌య్యారు. రోట‌రీ క్ల‌బ్‌కు చాలా ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంది. ఈ సంస్థ వందేళ్ల‌కు పైగా ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతోంది. ఇటీవ‌ల మెంట‌ల్ హెల్త్‌(మాన‌సిక ఆరోగ్యం) పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు మ‌నోజ్ఞ అనే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ఈ కార్య‌క్ర‌మానికే న‌టుడు చైత‌న్య బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మితుల‌య్యారు.

Shilpa Shetty : చెప్పులేసుకుని జెండా ఎగర‌వేసిన హీరోయిన్‌.. కామన్​సెన్స్​ లేదా అంటూ ట్రోల్స్‌.. రూల్స్ నాకు తెలుసంటూ కౌంట‌ర్‌

ఒక మంచి సామాజిక సేవా కార్యక్రమానికి ప్రచారకర్తగా ఎంపికవడం త‌న‌కు ఎంతో సంతోషాన్ని ఇస్తోంద‌ని ఈ సంద‌ర్భంగా కృష్ణ చైతన్య తెలిపారు. మనోజ్ఞ కార్యక్రమ ప్రారంభోత్సవంలో రోటరీ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ డాక్టర్ బి శంకర్ రెడ్డి, కార్యక్రమ కో ఆర్డినేటర్ గా పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ ఛైర్ మెంటల్ హెల్త్ రోటరేరియన్ డాక్టర్ వాసుప్రద కార్తిక్, సపోర్టింగ్ పార్టనర్ గా వ్యవహరిస్తున్న సీఎండీ మా హాస్పిటల్స్ రోటరేరియన్ మిస్ సునీత కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Chandramukhi 2 : డబ్బింగ్ చెబుతున్న టైంలో చంద్రముఖి ఎంట్రీ.. భయపడ్డ వడివేలు.. వీడియో వైరల్