Manchu Vishnu : ట్రోలింగ్స్‌పై ఆ నటుడి రియాక్షన్ .. పాలిటిక్స్ గురించి కూడా..

తనపై, తన కుటుంబంపై జరిగే ట్రోలింగ్స్ గురించి హీరో మంచు విష్ణు మాట్లాడారు. పాలిటిక్స్ గురించి కూడా కామెంట్స్ చేసారు.

Manchu Vishnu : ట్రోలింగ్స్‌పై ఆ నటుడి రియాక్షన్ .. పాలిటిక్స్ గురించి కూడా..

Manchu Vishnu

Updated On : November 12, 2023 / 10:19 AM IST

Manchu Vishnu : మంచువారి ఫ్యామిలీ తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఆ మధ్య ట్రోలింగ్‌ను కూడా ఫేస్ చేసారు. దీనిపై మంచు విష్ణు స్పందించారు. ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్.. 80 మంది అంతర్జాతీయ ఫైటర్లు..

మంచు విష్ణు బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ‘జిన్నా’ సినిమా తర్వాత మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా తనపై జరిగే ట్రోలింగ్స్.. పాలిటిక్స్ ఎంట్రీ వంటి పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ట్రోలింగ్స్ తనను ఎప్పుడూ ఎఫెక్ట్ చేయలేవన్నారు మంచు విష్ణు. తెలిసినవారెవరైనా ట్రోల్ చేస్తే ఫీలై కోపం వస్తుందేమో కానీ.. ఎవరో అనామకుడు పొట్టకూటి కోసం చేస్తుంటే ఎందుకు ఫీలవడం అంటూ సెటైర్ వేసారు. మనం ఎంత పాజిటివిటీ పంచుతామో.. అంతే పాజిటివిటీ తిరిగి వస్తుందని.. నెగెటివిటీని కోరుకోకూడదని అన్నారు మంచు విష్ణు.

తన ఫ్యామిలీ గురించి నెగెటివ్‌గా మాట్లాడినా తాను పట్టించుకోనన్నారు మంచు విష్ణు. ఇతరుల గురించి మనం ఆలోచిస్తే మన లైఫ్ ముందుకు వెళ్లదని.. తనకు జీవితంలో చాలా సాధించాలని ఉందని దాని చుట్టూనే తన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. చేసిన సినిమా ఆడకపోతే మనసుకి కష్టం అనిపిస్తుందని.. అయినా సక్సెస్, ఫెల్యూర్‌ని రెండింటినీ సమానంగా చూస్తానని చెప్పారు మంచు విష్ణు. తనకు ఎవరితో అయినా సరే మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందని.. అంతేకాకుండా విలన్ రోల్‌లో నటించాలని ఉందని చెప్పారు. నటుడిగా చాలా పాత్రలు చేయాలని.. పాలిటిక్స్‌లో తాను జీరో అని.. అసలు అది ఇంట్రెస్ట్‌లేని సబ్జెక్ట్ అన్నారు మంచు విష్ణు.

Manchu Manoj : అంబానీతో మంచు మనోజ్.. ఎందుకు కలిశారో తెలుసా..?

2022 లో వచ్చిన ‘జిన్నా’ సినిమా తర్వాత మంచు విష్ణు.. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ సినిమాలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.