Manchu Manoj : అంబానీతో మంచు మనోజ్.. ఎందుకు కలిశారో తెలుసా..?

మంచు మనోజ్ ఇండియన్ కుబేరుడు అంబానీని కలిశాడు. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ వారిద్దరూ ఎందుకు కలిశారు..?

Manchu Manoj : అంబానీతో మంచు మనోజ్.. ఎందుకు కలిశారో తెలుసా..?

Manchu Manoj met Ambani along with his wife bhuma mounika

Updated On : November 1, 2023 / 8:38 PM IST

Manchu Manoj : రెండు పెళ్లి చేసుకున్న తరువాత మళ్ళీ కెరీర్ లో బిజీ అవుతున్న మంచు మనోజ్.. టీవీ షోలు, సినిమాలను సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఓ ఓటీటీ సంస్థ కోసం ఒక టీవీ షో చేస్తున్నాడు. అలాగే ‘వాట్ ది ఫిష్’ అనే సినిమాని చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ హీరో ఇండియన్ కుబేరుడు అంబానీని కలిశాడు. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అది చూసిన నెటిజెన్స్ వీరిద్దరూ ఎందుకు కలిశారు..? అని ప్రశ్నలు వేస్తున్నారు.

అసలు విషయం ఏంటంటే.. రీసెంట్ గా అంబానీ ‘జియో వరల్డ్ ప్లాజా’ లాంచ్ చేశాడు. ఈ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఇక అంబానీ ఈవెంట్ అంటే.. సెలబ్రిటీస్ లేకుండా జరగడం కష్టం. ఏ ఈవెంట్ అయినా ఆ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్స్ తో పాటు ఇతర పరిశ్రమలోని స్టార్స్ కూడా కనిపించాల్సిందే. తాజాగా జరిగిన ‘జియో వరల్డ్ ప్లాజా’ లాంచ్ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, అలియా భట్, కరీనా కపూర్, జాన్వీ, దీపికా.. ఇలా బాలీవుడ్ స్టార్స్ తో పాటు రష్మిక మందన్న, శోభిత మరికొందరు టాలీవుడ్ తారలు కూడా కనిపించారు.

Manchu Manoj met Ambani along with his wife bhuma mounika Manchu Manoj met Ambani along with his wife bhuma mounika

Also read : Chiranjeevi : మెగా 156 టైటిల్ ఫిక్స్.. లీకైన స్క్రిప్ట్ పేపర్ ఫోటో.. టైటిల్ ఏంటో తెలుసా..?

ఇక ఇదే ఈవెంట్ కి మంచు మనోజ్ కి కూడా ఆహ్వానం అందడంతో భార్య మౌనికతో కలిసి ఆ కార్యక్రమానికి వెళ్ళాడు. అక్కడ అంబానీతో కలిసి మంచు దంపతులు దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక మనోజ్ నటిస్తున్న ‘వాట్ ది ఫిష్’ సినిమా విషయానికి వస్తే.. నూతన దర్శకుడు వరుణ్ కోరుకొండ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు మనోజ్ అండ్ వెన్నెల కిశోర్ లుక్స్ తప్ప మరో అప్డేట్ లేదు.