R Narayana Murthy: చిరంజీవి చెప్పింది వంద శాతం నిజం.. ఆయన్ని ఎవరు అవమానించలేదు: ఆర్ నారాయణ మూర్తి

నందమూరి బాలకృష్ణ ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవి గురించి(R Narayana Murthy) కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. జగన్ ను సైకో అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు ఆయన.

R Narayana Murthy: చిరంజీవి చెప్పింది వంద శాతం నిజం.. ఆయన్ని ఎవరు అవమానించలేదు: ఆర్ నారాయణ మూర్తి

Actor R Narayana Murthy responds to Chiranjeevi-Balakrishna controversy

Updated On : September 27, 2025 / 5:45 PM IST

R Narayana Murthy: నందమూరి బాలకృష్ణ ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవి గురించి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. జగన్ ను సైకో అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు ఆయన. ఇక ఈ కామెంట్స్ పై మెగాస్టార్ చిరజీవి సైతం సోషల్ మీడియాలో ఒక నోట్ ను విడుదల చేశారు. తాజాగా ఈ వివాదంపై పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్పందించాడు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీలో(R Narayana Murthy) బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి చెప్పింది 100 శాతం నిజం. ఎందుకంటే ఆరోజు జగన్ ను కలిసిన వాళ్లలో నేను కూడా ఉన్నాను. ఇలా అందరం వెళ్లి జగన్ గారిని కలుద్దాం అని చిరంజీవి గారే స్వయంగా నాకు ఫోన్ చేశారు. అది ఆయన సంస్కారం.

Ravi K Chandran: పవన్ కళ్యాణ్ అలా నిల్చుంటే చాలు.. ఆ క్రేజ్ ఏ స్టార్ హీరోకి రాదు: రవి కె. చంద్రన్

అందరం చిరంజీవి గారి ఇంట్లోనే కలిశాం. ఆయనే పరిశ్రమ పెద్దగా చొరవతీసుకొని సీఎం జగన్ తో మాట్లాడారు. కేవలం చిరంజీవి గారి వల్లే ఆ రోజు ఆ సమస్య పరిష్కారం అయింది. అలాగే, ఇండస్ట్రీలో ఉన్న ఇతర సమస్యలను కూడా ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయంలో నేను బాలకృష్ణ గురించి మాట్లాడదల్చుకోలేదు. సినిమా టికెట్లు పెంచడం కరక్ట్ కాదు. సామాన్యుడికి వినోదాన్ని పంచేది కేవలం సినిమా మాత్రమే. అలాంటి సినిమాని టికెట్ ధరలు పెంచి సామాన్యుడికి దూరం చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు అంటూ చెప్పుకొచ్చాడు నారాయణ మూర్తి.