‘మా’ ఎలక్షన్ ఎఫెక్ట్: శివాజీరాజా సంచలన నిర్ణయం

  • Published By: vamsi ,Published On : March 14, 2019 / 04:39 AM IST
‘మా’ ఎలక్షన్ ఎఫెక్ట్: శివాజీరాజా సంచలన నిర్ణయం

Updated On : March 14, 2019 / 4:39 AM IST

‘మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న శివాజీ రాజా ప్యానల్, నరేష్ ప్యానల్ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుని ఎలక్షన్ వాతావరణాన్ని మరింత వేడెక్కించిన సంగతి తెలిసిందే. ‘మా’ ఎన్నికల వ్యవహారాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్లి, ఛానల్స్‌లో డిబేట్లు పెట్టడం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చివరకు ఎన్నికల్లో నరేష్ గెలవడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ మా అసోసియేష‌న్ మాజీ అధ్య‌క్షుడు శివాజీ రాజా మాత్రం ఈ ఎన్నికలలో తను ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడట. 800 ఓటర్లు ఉండే ‘మా’లో మెజారిటీ నటులు నరేష్ వైపు ఉండడం.. మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా నరేష్‌కే దక్కడంతో.. మా అసోసియేష‌న్ మాజీ అధ్య‌క్షుడు శివాజీరాజా ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
‘మా’ ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే శివాజీరాజా పూర్తిగా సినిమా ఇండస్ట్రీని వదిలేస్తున్నట్లు తెలుస్తుంది. అరుణాచ‌లం వెళ్లి అక్క‌డే త‌మ కుటుంబం సెటిల్ అయిపోతామ‌ని శివాజీ రాజా చెబుతున్న‌ాడట. అయితే తాను ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్నా కూడా పేద‌వాళ్ల‌కు మాత్రం అండ‌గా ఉంటానని చెబుతున్నారు. ఏది ఏమైనా ‘మా’ ఎన్నికలు మరోసారి సినిమా ఇండస్ట్రీలో కాక పుట్టించాయి అనే అభిప్రాయం కలుగుతుంది.