MAA Elections 2021 : అతని వల్లే ‘మా’ లో గొడవలు.. శివాజీ రాజా సెన్సేషనల్ కామెంట్స్

నటుడు శివాజీ రాజా అసలు ‘మా’ అసోసియేషన్‌లో గొడవలకు ఆ వ్యక్తే కారణం అంటూ సంచలన ఆరోపణలు చేశారు..

MAA Elections 2021 : అతని వల్లే ‘మా’ లో గొడవలు.. శివాజీ రాజా సెన్సేషనల్ కామెంట్స్

Maa

Updated On : October 9, 2021 / 6:47 PM IST

MAA Elections 2021: ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి నానా హంగామా చేసిన బండ్ల గణేష్, సీనియర్ నటుడు సీవీఎల్ నామినేషన్స్ ఉపసంహరించుకున్నారు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ – మంచు విష్ణుల మధ్య వివాదం మరింత ముదిరింది.

MAA Elections: నేను ప్రచారం ముగించి నాలుగు రోజులైంది.. అతనికి సిగ్గు లేదు -ప్రకాష్ రాజ్

ఇరు ప్యానెల్స్‌లోని మీడియా ముందే ఒకరిపై మరొకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. మరికొద్ది గంటల్లో ఎన్నికలు మొదలు కానున్నాయి. ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠతకు ఆదివారం సాయంత్రం కల్లా తెరపడనుంది. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు శివాజీ రాజా ‘మా’ ఎన్నికలపై స్పందించారు.

Maa Elections : ప్రకాశ్ రాజ్‌కు సీవీఎల్ సారీ..! ఓటే వేయనని ప్రకటన!

‘‘మా’ లో గొడవలకు ప్రధాన కారణం వీకే నరేష్.. గత ఎన్నికల్లో నాగబాబు మద్దతు ఇవ్వకపోతే నరేష్ గెలిచేవాడు కాదు. సభ్యులకు సేవ చెయ్యాలనే ఉద్దేశంతోనే ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు’’ అన్నారు.

MAA Elections: గెలిచిన.. గెలవకపోయినా..’మా’ క్యాంటీన్ పెడతా -జీవిత రాజశేఖర్

సమస్యలకు పరిష్కారం..
ముందుగా ‘మా’ అధ్యక్షుడి పదవీ కాలాన్ని రెండు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల వరకు పొడిగించాలి. ఎందుకంటే రెండేళ్లలో సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చెయ్యడం అనేది సాధ్యం కాదు. అందుకే కృష్ణ, కృష్ణంరాజు, మురళీ మోహన్, చిరంజీవి, మోహన్ బాబు లాంటి పెద్దలందర్నీ కూర్చోబెట్టి ఈ విషయం గురించి చర్చిస్తే బాగుంటుంది.. ఫస్ట్ రెండేళ్లు మంచు విష్ణు అధ్యక్షుడిగా, ప్రకాష్ రాజ్ జనరల సెక్రటరీగా.. తర్వాత రెండు సంవత్సరాలు ప్రకాష్ రాజ్ అధ్యక్షుడిగా, మంచు విష్ణు జనరల్ సెక్రటరీగా పనిచేసేలా చర్చలు జరిపితే కనుక రెండు ప్యానళ్ల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు’ అని చెప్పారు శివాజీ రాజా..

MAA Elections : లాజిక్‌తో సవాల్ విసిరిన నాగబాబు..! విష్ణు దగ్గర బదులుందా..?