Sonu Sood : బెజవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న సోనూ సూద్..

సోనూ సూద్.. ఇంద్రకీలాద్రి రాబోతున్నారని సమాచారం అందడంతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు..

Sonu Sood : బెజవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న సోనూ సూద్..

Sonu Sood

Updated On : September 9, 2021 / 3:14 PM IST

Sonu Sood: రియల్ హీరో సోనూ సూద్ గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా.. సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. కరోనా మహమ్మారి విజృంభించడం ప్రారంభమైనప్పటి నుండి ఆయన చేసిన, చేస్తున్న సేవా కార్యక్రమాలు అద్భుతం.

Sonu Sood

ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి సాయమందించి వారి పాలిట దేవుడిలా నిలిచారు సోను. ఉద్యోగాలు, వ్యాపారానికి, వ్యవసాయానికి సాయం, కోవిడ్ పేషెంట్లను పలు రకాలుగా ఆదుకోవడం, ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చెయ్యడం, ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చెయ్యడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.

Sonu Sood

సోనూ సూద్ నుంచి సాయం పొందినవారు ఆయణ్ణి దేవుడిలా కొలుస్తూ.. గుళ్లు కట్టి పూజలు చేశారు. కటౌట్లకు పాలాభిషేకాలు చేశారు. పబ్లిక్ ప్లేస్‌లో సోనూ కనిపిస్తే జనసందోహంతో ట్రాఫిక్ జాం లు అయిన సంఘటనలు చూశాం.

Sonu Sood Temple