Swara Bhasker: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్.. భర్త ఎవరంటే..

గత నెలలో తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు స్వర భాస్కర్ గురువారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఫహద్ అహ్మద్ అనే రాజకీయ నేతను గత జనవరి 6న రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు స్వర భాస్కర్ వెల్లడించింది. ట్విట్టర్‌లో దీనికి సంబంధించి ఒక వీడియో షేర్ చేసింది.

Swara Bhasker: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్.. భర్త ఎవరంటే..

Updated On : February 16, 2023 / 8:54 PM IST

Swara Bhasker: బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. గత నెలలో తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు స్వర భాస్కర్ గురువారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఫహద్ అహ్మద్ అనే రాజకీయ నేతను గత జనవరి 6న రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు స్వర భాస్కర్ వెల్లడించింది.

Zeenat Aman: తన తొలి లుక్ టెస్ట్ ఫొటో షేర్ చేసిన జీనత్ అమన్.. బ్లాక్ అండ్ వైట్ ఫొటోకు నెటిజన్లు ఫిదా

ట్విట్టర్‌లో దీనికి సంబంధించి ఒక వీడియో షేర్ చేసింది. ఈ సందర్భంగా ‘‘కొన్నిసార్లు మనం ఎక్కడో దూరంగా వెతికేది మన పక్కనే ఉంటుంది. మేం మొదట ప్రేమ కోసం వెతికాం. తర్వాత స్నేహాన్ని కనుగొన్నాం. తర్వాత ఇద్దరం ఒకరినొకరం కనుగొన్నాం. వెల్కమ్ టు మై హార్ట్.. ఫహద్ అహ్మద్’’ అంటూ స్వర భాస్కర్ ట్వీట్ చేసింది. ఫహద్ అహ్మద్ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నేత. ఒక రాజకీయ సంబంధ ర్యాలీలో ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారు. కొంతకాలం తర్వాత ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Tanish: కేసీపీడీ అంటున్న తనిష్.. కొత్త సినిమా ప్రకటించిన యువ హీరో

జనవరి 6న, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఒక కోర్టులో అత్యంత సన్నిహితుల మధ్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా వీరికి సంబంధించిన పెళ్లి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. అయితే స్వర భాస్కర్ జంట రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ, త్వరలోనే సంప్రదాయబద్ధంగా, పూర్తి స్థాయిలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సన్నిహితులు, అభిమానుల కోసం వచ్చే నెలలోనే వీరి పెళ్లి మరోసారి ఘనంగా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం స్వర భాస్కర్ పెళ్లికి సంబంధించిన వార్త బాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది. సోషల్ మీడియాలోనూ స్వర భాస్కర్ పేరు ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు చెబుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)