Zeenat Aman: తన తొలి లుక్ టెస్ట్ ఫొటో షేర్ చేసిన జీనత్ అమన్.. బ్లాక్ అండ్ వైట్ ఫొటోకు నెటిజన్లు ఫిదా

సత్యం శివం సుందరం అనే చిత్రం కోసం దర్శకుడు రాజ్ కపూర్ ఈ లుక్ టెస్ట్ నిర్వహించారు. కారణం.. అంతకుముందు వరకు జీనత్ నటించిన చిత్రాల ద్వారా ఆమెకు పాశ్చాత్య దేశాల తరహా నటీమణి అనే ఇమేజ్ వచ్చింది. దీంతో తన పాత్రకు జీనత్ సరిపోతుందా.. లేదా అని రాజ్ కపూర్ ఆమెకు ఈ లుక్ టెస్ట్ నిర్వహించారు.

Zeenat Aman: తన తొలి లుక్ టెస్ట్ ఫొటో షేర్ చేసిన జీనత్ అమన్.. బ్లాక్ అండ్ వైట్ ఫొటోకు నెటిజన్లు ఫిదా

Zeenat Aman: బాలీవుడ్‌ను ఒకప్పుడు ఏలిన నటీమణుల్లో జీనత్ అమన్ ఒకరు. 1970, 80 దశకాల్లో ఆమె బాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేశారు. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. వాటిలో ఒకటి ‘సత్యం శివం సుందరం’. 1978లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయం సాధించింది.

MBA Chaiwala: మెర్సిడెస్ బెంజ్ కారు కొన్న చాయ్‌వాలా.. ఎలా సాధ్యమైందంటే!

రాజ్ కపూర్ రూపొందించిన ఈ చిత్రంలో శశి కపూర్ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రానికి జీనత్ అమన్‌ను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసే ముందు ఆమెకు దర్శకుడు లుక్ టెస్ట్ నిర్వహించారు. 1977లో జీనత్ అమన్‌కు లుక్ టెస్ట్ నిర్వహించారు. కొన్ని ఫొటో షూట్లు చేశారు. దీనికి సంబంధించిన ఒక ఫొటోను జీనత్ తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసింది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఈ ఫొటోలో జీనత్ గ్లామరస్‌గా కనిపించింది. దీనికి సంబంధించిన వివరాల్ని కూడా ఆమె వెల్లడించింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ఫొటోను 1977లో జేపీ సింఘాల్ అనే ఫొటోగ్రాఫర్ తీశారు.

Prithvi Shaw: సెల్ఫీ ఇవ్వలేదని పృథ్వీ షా కారుపై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

సత్యం శివం సుందరం అనే చిత్రం కోసం దర్శకుడు రాజ్ కపూర్ ఈ లుక్ టెస్ట్ నిర్వహించారు. కారణం.. అంతకుముందు వరకు జీనత్ నటించిన చిత్రాల ద్వారా ఆమెకు పాశ్చాత్య దేశాల తరహా నటీమణి అనే ఇమేజ్ వచ్చింది. దీంతో తన పాత్రకు జీనత్ సరిపోతుందా.. లేదా అని రాజ్ కపూర్ ఆమెకు ఈ లుక్ టెస్ట్ నిర్వహించారు. ముంబైలోని ఆర్కే స్టూడియోలో ఈ టెస్ట్ నిర్వహంచారు. ఈ టెస్టు కోసం ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన భాను అథైయ్యా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. సినిమాలోని జీనత్ పాత్ర రూప వివాదాస్పదమైంది. జీనత్ గ్లామర్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

Kanna Lakshmi Narayana: మోదీ పట్ల జీవితాంతం అభిమానంతో ఉంటా.. రాష్ట్ర పార్టీలో పరిస్థితులకు ఇమడలేకే రాజీనామా..

అయితే, అందులో అశ్లీలత, అభ్యంతరం ఏమీ లేదని జీనత్ అభిప్రాయం. దర్శకుడికి కావాల్సినట్లుగా అందంగా కనిపించడమే తన బాధ్యత అని జీనత్ తెలిపింది. సినిమాలో కనిపించే ప్రతీదీ ముందుగానే ప్రాక్టీస్ చేసి, కొరియోగ్రఫీ చేస్తారని, బోలెడంత మంది సిబ్బంది ముందు అలాంటివి చేయాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడింది. ఈ సినిమాలోని జీనత్ పాత్ర గురించి రాజ్ కపూర్‌కు అనుమానం ఉండటంతో, ముందుగా ఆమెకు సంబంధించిన రీల్‌ను డిస్ట్రిబ్యూటర్లకు ఆయన ప్రదర్శించారు. ఈ రీల్ చూసిన వెంటనే అందరూ సినిమాను కొనేశారని జీనత్ తెలిపింది. ప్రస్తుతం ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.