Venu Yeldandi : నా ‘బలగం’ సినిమా అందరూ చూసారు.. ఒక్కరు తప్ప.. వేణు ఎమోషనల్ పోస్ట్..
కమెడియన్ వేణుని డైరెక్టర్‌గా నిలబెట్టిన సినిమా 'బలగం'. ఈ సినిమాని గుర్తు చేసుకుంటూ వేణు పెట్టిన ఎమోషనల్ పోస్టు వైరల్ అవుతోంది.

Venu Yeldandi
Venu Yeldandi : ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైనర్ గా వచ్చిన ‘బలగం’ సినిమా నటుడు వేణుని డైరెక్టర్‌గా నిలబెట్టింది. ఎన్నో అవార్డులు తీసుకువచ్చింది. రీసెంట్‌గా వేణు తన బలగం సినిమా ఒకరు చూడలేకపోయారంటూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. వేణు పోస్టు వైరల్ అవుతోంది.

Venkatayya Yeldandi
Krithi Shetty : బాబోయ్.. కృతిశెట్టి బెల్లీ డ్యాన్స్ చూశారా?
కమెడియన్ వేణు డైరెక్టర్‌గా ఎంట్రి ఇచ్చి సినిమా ‘బలగం’ బాగా ఆడింది. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, జబర్దస్త్ వేణు, రచ్చ రవి కీలక పాత్రల్లో నటించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ మూవీ నిర్మించారు. మనుష్యుల మధ్య తరిగిపోతున్న అనుబంధాలను వేణు తెరపై ఎంతో చక్కగా చూపించారు. కన్నీరు పెట్టించారు. తెలంగాణలోని పల్లెల్లో రోడ్లపై స్క్రీన్లు పెట్టి మరీ బలగం సినిమాను చూపించారు. మానవ సంబంధాలను ఎలా పదిలపరుచుకోవాలో తన సినిమాతో మంచి మెసేజ్ ఇచ్చారు వేణు. ఈ సినిమా అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొంది అందరి మన్ననలు అందుకుంది. వేణులోని దర్శకత్వ ప్రతిభను ప్రపంచానికి చాటింది.
True Lover Review: ‘ట్రూ లవర్’ మూవీ రివ్యూ.. లవ్ ఫెయిల్యూర్స్, లవర్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా..
ఇదిలా ఉంటే తాజాగా వేణు సోషల్ మీడియా ఖాతాలో ‘నా బలగం సినిమా అందరూ చూసారు.. మా నాన్న తప్ప.. మిస్ యూ నాయినా’ అంటూ పోస్టు పెట్టారు. బలగం సినిమా 2023 మార్చి 20న విడుదలైంది. వేణు తండ్రిగారైన వెంకటయ్య వెల్డండి 2000 ఫిబ్రవరి 6న కన్నుమూసినట్లు వేణు పోస్ట్ ద్వారా తెలుస్తోంది. తన తండ్రికి తాను తీసిన సినిమా చూపించలేకపోయినందుకు బాధపడుతూ వేణు తన పోస్టు ద్వారా ఎమోషనలైనట్లు తెలుస్తోంది. వేణు ఫిబ్రవరి 6న ఈ పోస్టు పెట్టారు. తండ్రికి నివాళిగా వేణు పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
View this post on Instagram