Laxman Meesala : ఒకప్పుడు అల్లు అర్జున్ ఇంటికి కూలి పని చేసి.. ఇప్పుడు స్టార్ నటుడిగా..

ఓవర్ నైట్ స్టార్ అవ్వడం కొందరి విషయంలో మాత్రమే జరుగుతుంది. ఓ నటుడు ఎన్నో కష్టాలు పడి స్టార్ డమ్ సంపాదించుకున్నారు. అతని కష్టాలు వింటే మనసు చలించిపోతుంది.

Laxman Meesala : ఒకప్పుడు అల్లు అర్జున్ ఇంటికి కూలి పని చేసి.. ఇప్పుడు స్టార్ నటుడిగా..

Laxman Meesala

Laxman Misala : టాలీవుడ్ లో లక్ష్మణ్ మీసాల క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాగానే రాణిస్తున్నారు. నటుడు కాకముందు లక్ష్మణ్ అల్లు అర్జున్ ఇంటికి కూలీగా పనిచేసారట..సక్సెస్‌కి ముందు తను పడ్డ కష్టాలు వింటే మనసు చలించిపోతుంది. తాజాగా లక్ష్మణ్ మీడియాకు తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు.

Kaushal Manda : నా ఆర్మీ కోసమే హీరో అయ్యాను.. బిగ్‌బాస్ విన్నర్ కౌశల్ హీరోగా ‘రైట్’ మూవీ.. మంచు మనోజ్ గెస్ట్ గా..

లక్ష్మణ్ సినిమాల్లోకి రాకముందు రంగస్థలంపై అనేక పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించారు. ‘కో అంటే కోటి’ సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసారు. నగరం నిద్రపోతున్న వేళ, వంగవీటి, ఘాజీ, ఆర్‌ఎక్స్ 100, జార్జి రెడ్డి, బీమ్లా నాయక్, చెడ్డీ గ్యాంగ్ తమాషా, దళారి వంటి సినిమాలు చేసారు. ఒరిస్సా గణపతి జిల్లా రాణిపేటలో పుట్టి పెరిగిన లక్ష్మణ్ పదవ తరగతితో చదువు ఆపేసారట. ఇటీవల మీడియాతో లక్ష్మణ్ తన వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకున్నారు.

సినిమాల్లోకి రాకముందు లక్ష్మణ్ ఏ పనిలోనూ స్థిరంగా ఉండేవారు కాదట. చాలా రోజులు ఇండ్ల నిర్మాణంలో కూలీ పనులకు వెళ్లారట. తనకు తెలియకుండానే ఎంతోమంది సెలబ్రిటీల ఇళ్లలో పనిచేసానని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ ఇంటి నిర్మాణం సమయంలో కూడా కూలీ పని చేసానని లక్ష్మణ్ చెప్పారు. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి ఇంటితో పాటు ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కడుతున్నప్పుడు పనిచేసానని అన్నారు. కూలీ పనులకు వెళ్లినపుడు చాలా సార్లు దెబ్బలు తగిలాయని రక్తం వచ్చిందని చెప్పారు. సినిమాలపై ఉన్న మక్కువతో నటుడిగా కొనసాగుతున్నట్లు లక్ష్మణ్ అన్నారు.

Prabhas Kalki Trailer : ప్రభాస్ ‘కల్కి 2898AD’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఎప్పుడో తెలుసా?

తాజాగా విడుదలైన మంగళవారం సినిమాలో లక్ష్మణ్ గుడ్డివాడిగా నటించి మెప్పించారు. రంగస్థల వేదికపై ఉత్తమ నటుడిగా ఎన్నో అవార్డులు అందుకున్న లక్ష్మణ్ తెలుగు తెరపై తిరుగులేని నటుడిగా వరుస అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నారు.