Mandakini: కుర్రాళ్ళ కలల రాణి మందాకినీ.. ఇప్పుడు ఇలా..!
1985లో బాలీవుడ్ లో విడుదలైన రాజ్ కపూర్ సినిమా రామ్ తేరి గంగా మెయిలీ.. పల్చటి తెల్లని తడి వస్త్రంలో జలపాతం వద్ద మందాకినీ.. అప్పట్లో దేశంలోని ఈ పాట చూడని కుర్రాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఒకే ఒక్క సినిమాతో 22 ఏళ్ల మందాకినీ దేశంలోని కుర్రాళ్లందరినీ హృదయాలను ఖల్లాస్ చేసేసింది. ఆ సినిమా దెబ్బతో పదేళ్ళపాటు బాలీవుడ్ మేకర్స్ మందాకినీ చల్లని చూపు కోసం పడిగాపులు కాసింది.

Mandakini
Mandakini: 1985లో బాలీవుడ్ లో విడుదలైన రాజ్ కపూర్ సినిమా రామ్ తేరి గంగా మెయిలీ.. పల్చటి తెల్లని తడి వస్త్రంలో జలపాతం వద్ద మందాకినీ.. అప్పట్లో దేశంలోని ఈ పాట చూడని కుర్రాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఒకే ఒక్క సినిమాతో 22 ఏళ్ల మందాకినీ దేశంలోని కుర్రాళ్లందరినీ హృదయాలను ఖల్లాస్ చేసేసింది. ఆ సినిమా దెబ్బతో పదేళ్ళపాటు బాలీవుడ్ మేకర్స్ మందాకినీ చల్లని చూపు కోసం పడిగాపులు కాసింది. మిథున్ చక్రవర్తితో డాన్స్ డాన్స్, ఆదిత్య పంచోలితో కహాన్ హై కనూన్, గోవిందతో ప్యార్ కర్కే దేఖో ఇలా వరస బ్లాక్ బస్టర్ సినిమాలతో ఓ రేంజ్ హవా చూపించింది.

Mandakini
అప్పట్లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ప్రేమాయణం సాగిస్తుందని యావత్ ప్రపంచం అంతా కోడై కూయగా దావూద్ దేశం విడిచి పారిపోవడం.. మందాకినీ ఇండస్ట్రీకి దూరమవడం ఒక్కొక్కటి జరిగిపోయాయి. అయితే.. మందాకినీ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఇప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం మందాకినీ ఇప్పుడు ఓ గృహిణి.. కుమారుడికి పెళ్లిచేసి పూర్తి కుటుంబ జీవితాన్ని గడుపుతున్న మహిళ, అంతేకాదు ఆమె ఓ యోగా శిక్షకురాలు.. అంతకు ముందు ఆమె ఓ సాథ్వీ కూడా.

Mandakini
బహుశా ఒక నటి జీవితంలో ఇన్ని మలుపులు ఉండవేమో అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్ హీరోయిన్.. ఇండియాను గడగడలాడించిన డాన్ గర్ల్ ఫ్రెండ్.. ఆ తర్వాత ఓ బౌద్ధ సన్యాసి.. సాథ్వీ. ఆ తర్వాత మళ్ళీ సాధారణ జీవితం ప్రారంభించి.. దలైలామా అనుచరుడైన మాజీ సన్యాసిని పెళ్లి చేసుకొని.. పిల్లలతో వైవాహిక జీవితం.. పిల్లలకు పెళ్లి చేసి ఆనందమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్న పరిపూర్ణ మహిళ మందాకినీ. అప్పుడు ఒకనాడు కుర్రాళ్ళ కలలరాణి మందాకినీ ఇప్పుడు ఇలా ఉందా అంటూ నెటిజన్లు ఆమె ఫోటోను చూసి షాక్ అవుతున్నారు. ఆమె జీవితంలో ట్విస్టులకు.. ఆమె ఇప్పుడు గడిపే జీవితాన్ని చూసి అవాక్కవుతున్నారు.
View this post on Instagram