Nivetha Pethuraj : హీరోయిన్ మాత్రమే కాదు.. బ్యాడ్మింటన్ ఛాంపియన్ కూడా.. కప్పు కొట్టిన నివేదా..
హీరోయిన్ నివేదా పేతురేజ్ ఆల్రెడీ F1 కార్ రేసర్. ఫార్ములా కార్ రేసింగ్ లో పలు పతకాలు కూడా సాధించింది. ఇప్పుడు బ్యాడ్మింటన్(Badminton) లో కప్పు కొట్టింది.

Actress Nivetha Pethuraj Winning state level Badminton Championship Photos goes Viral
Nivetha Pethuraj : మన సెలబ్రిటీల్లో కొంతమంది సినిమాల్లోనే కాదు ఆటల్లో కూడా స్టార్స్. చాలా మంది స్టార్స్ స్టేట్, నేషనల్ లెవల్లో కూడా పలు గేమ్స్ లో ఆడి గెలిచారు. ఇటీవలే సీనియర్ నటి ప్రగతి పవర్ల్ లిఫ్టింగ్ లో సౌత్ ఇండియా చాంప్ గా సిల్వర్ మెడల్ గెలుచుకుంది. తాజాగా ఓ హీరోయిన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా కప్పు కొట్టింది.
మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, రెడ్, పాగల్, అలవైకుంఠపురంలో, దాస్ కా ధమ్కీ.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలతో నివేదా పేతురేజ్ తెలుగులో మంచి ఫామ్ లో ఉంది. వేరే భాషల్లో కూడా సినిమాలు చేస్తూ సౌత్ లో అభిమానులని బాగానే సంపాదించుకుంది నివేదా. నివేదా ఆల్రెడీ F1 కార్ రేసర్. ఫార్ములా కార్ రేసింగ్ లో పలు పతకాలు కూడా సాధించింది. ఇప్పుడు బ్యాడ్మింటన్(Badminton) లో కప్పు కొట్టింది.
తమిళనాడులో జరిగిన స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో మధురై తరపున డబుల్స్ ఆడి విన్నర్ గా నిలిచింది. తనకి వచ్చిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ కప్ తో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విషయాన్ని తెలిపింది నివేదా. దీంతో అంతా నివేదాకు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఆల్రెడీ హీరోయిన్ గా దూసుకుపోతుంది, కార్ రేసింగ్ చేస్తుంది, ఇప్పుడు బ్యాడ్మింటన్ ఛాంపియన్ కూడా.. ఈ భామలో ఇంకెన్ని ట్యాలెంట్స్ ఉన్నాయో అని కామెంట్స్ చేస్తూ అభినందిస్తున్నారు.