Actress Poorna : తల్లి కాబోతున్న పూర్ణ.. ఘనంగా సీమంతం వేడుకలు..

సౌత్ లోని అన్ని లాంగ్వేజ్స్ లో సినిమాలు, టెలివిజన్ షోలు చేస్తూ కెరీర్ లో ఫుల్ బిజీగా ఉంటున్న నటి పూర్ణ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల తల్లి కాబోతున్నట్లు కొన్ని ఫోటోలు షేర్ చేసి తెలియజేసింది. తాజాగా నిన్న ఘనంగా శ్రీమంతం వేడుకలు జరుపుకుంది.

Actress Poorna : తల్లి కాబోతున్న పూర్ణ.. ఘనంగా సీమంతం వేడుకలు..

Actress Poorna

Updated On : January 30, 2023 / 12:15 PM IST

Actress Poorna : మలయాళ సినిమాలతో ఇండస్ట్రీకి పరిచమైన నటి పూర్ణ.. తెలుగులోకి శ్రీమహాలక్ష్మి మూవీతో ఎంట్రీ ఇచ్చింది. రవిబాబు డైరెక్ట్ చేసిన అవును చిత్రాలతో టాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకున్న పూర్ణ.. టీవీ షోలతో తెలుగు వారికీ మరింత దగ్గరైంది. సౌత్ లోని అన్ని లాంగ్వేజ్స్ లో సినిమాలు, టెలివిజన్ షోలు చేస్తూ కెరీర్ లో ఫుల్ బిజీగా ఉంటున్న ఈ భామ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కేరళకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ని పూర్ణ గత ఏడాది అక్టోబర్ లో వివాహం చేసుకుంది. అయితే ఆ విషయాన్ని అభిమానులకు మాత్రం పెళ్లి అయ్యిన కొన్ని రోజులకు తెలియజేసింది.

Actress Poorna: నటి పూర్ణ మెహందీ వేడుక ఫొటోలు..

ఇక అప్పటి నుంచి పెళ్లికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తున్న ఈ భామ.. ఇటీవల తల్లి కాబోతున్నట్లు కొన్ని ఫోటోలు షేర్ చేసి తెలియజేసింది. తాజాగా నిన్న ఘనంగా సీమంతం వేడుకలు జరుపుకుంది. శ్రీమంతం కార్యక్రమానికి రెడీ అవుతున్న వీడియోలను, ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేసింది. అత్యంత బంధుమిత్రులు మధ్య పూర్ణ తన సీమంతాని ఆనందంగా జరుపుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా పూర్ణ సినిమాలు విషయానికి వస్తే.. ఈ ఏడాది ఆమె నటించిన ఆరు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తమిళంలో మూడు సినిమాలు, మలయాళంలో ఒక సినిమా, తెలుగులో రెండు సినిమాలు. తెలుగు సినిమాలో నాని దసరా కూడా ఉంది. దసరా సినిమాలో పూర్ణ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మూవీ టీజర్ ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో విడుదల కానుంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Thesny Alikhan (@thesnyalikhan)