Purna : తల్లి కాబోతున్న నటి పూర్ణ..
గత కొన్ని నెలల క్రితం దుబాయ్ కి చెందిన వ్యాపార వేత్త షానిద్ ఆసిఫ్ అలీని దుబాయ్ లో వివాహం చేసుకుంది ఈ మలయాళీ భామ. పెళ్లి తర్వాత కూడా కొన్ని షోలలో కనిపించింది. తాజాగా తాను తల్లిని కాబోతున్నాను అని ప్రకటించింది. తన పేరెంట్స్, బంధువులతో........

Actress Poorna is going to be a mother
Purna : నటి పూర్ణ మలయాళం సినిమాలతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో సీమ టపాకాయ్ సినిమాతో బాగా వెలుగులోకి వచ్చింది. అనంతరం తమిళ్, తెలుగు, మలయాళం లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. గత కొన్నేళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వరుస సినిమాలు చేస్తుంది. ఒకపక్క సినిమాలు చేస్తూనే పలు టీవీ షోలలో జడ్జిగా కనిపిస్తూ అలరిస్తుంది.
గత కొన్ని నెలల క్రితం దుబాయ్ కి చెందిన వ్యాపార వేత్త షానిద్ ఆసిఫ్ అలీని దుబాయ్ లో వివాహం చేసుకుంది ఈ మలయాళీ భామ. పెళ్లి తర్వాత కూడా కొన్ని షోలలో కనిపించింది. తాజాగా తాను తల్లిని కాబోతున్నాను అని ప్రకటించింది. తన పేరెంట్స్, బంధువులతో తాను తల్లి కాబోతున్న విషయాన్ని పంచుకొని సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్న సన్నివేశాల్ని వీడియో రూపంలో తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది.
Naresh- Pavithra : ఇక అంతా అఫీషియల్.. లిప్ కిస్‌తో నరేష్-పవిత్రా పెళ్లి ప్రకటన..
ఈ వీడియోలో తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది. తన ఆనందాన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితులతో షేర్ చేసుకుంది. పూర్ణ తల్లి కాబోతుంది అని ప్రకటించడంతో పలువురు ప్రముఖులు, అభిమానులు ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఇప్పుడు టీవీ షోలలో, సినిమాలలో కనిపిస్తుందా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు పూర్ణ.