Actress Pragathi: పవర్ లిఫ్టింగ్ కాంపిటిషన్‌లో దుమ్మురేపిన నటి ప్రగతి.. గోల్డ్ మెడల్ కైవసం.. 50 ఏళ్ల వయసులో ఫుల్ జోష్..
నా ప్రియమైన వారందరికీ టన్నుల కొద్దీ ప్రేమ తప్ప మరేమీ లేదు. అందమైన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ నా ధన్యవాదాలు.

Actress Pragathi: టాలీవుడ్ నటి ప్రగతి సినీ రంగంలోనే కాదు క్రీడల్లోనూ అదరగొడుతున్నారు. ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నేషనల్ లెవెల్ పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు. 2024లో సౌతిండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ సాధించిన నటి ప్రగతి.. ఇప్పుడు ఏకంగా గోల్డ్ మెడల్ సాధించారు. కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025 లో గోల్డ్ సాధించారు. దీంతో పాటు మరో రెండు విభాగాల్లోనూ మెడల్స్ అందుకున్నారు. దీంతో నటి నటి ప్రగతి ఆనందానికి అవధులు లేవు.
స్క్వేట్ 115 కిలోలు, బెంచ్ ప్రెస్ 50 కిలోలు, డెడ్ లిఫ్ట్ 122.5 కిలోల పోటీల్లో పాల్గొన్నారు ప్రగతి. ఇందులో గోల్డ్ తో పాటు రెండు మెడల్స్ సంపాదించారు. ఇలా మొత్తంగా మూడు మెడల్స్ సాధించడంతో నటి ప్రగతి ఎమోషనల్ అయ్యారు. తనక చాలా ఆనందంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇందులో ఆమె సాధించిన విజయాన్ని పంచుకున్నారు.
”అభిరుచి, క్రమశిక్షణ, కృషి, పిచ్చి, విరిగిన హృదయం మాత్రమే దీనికి అవసరం. నా ప్రియమైన వారందరికీ టన్నుల కొద్దీ ప్రేమ తప్ప మరేమీ లేదు. అందమైన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ నా ధన్యవాదాలు. నా కోచ్ @mr._uday_kat కి ప్రత్యేక ధన్యవాదాలు. @kaushik_powerlifting
జాతీయ పవర్‌లిఫ్టింగ్ పోటీ 2025లో బంగారు పతకం” అంటూ ట్వీట్ చేశారు నటి ప్రగతి.
50 ఏళ్ల వయసులోనూ నటి ప్రగతి చూపుతున్న తెగువ, అంకిత భావానికి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. రియల్లీ గ్రేట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: సినిమాల్లో అశ్లీల, అసభ్యకర కంటెంట్..! నటి శ్వేతా మీనన్‌పై కేసు నమోదు..
View this post on Instagram