Satya Krishnan : అవకాశాల కోసం కొందరు లొంగిపోతున్నారు.. కాస్టింగ్ కౌచ్‌పై నటి సంచలన వ్యాఖ్యలు
సత్య కృష్ణన్ అక్క, వదిన పాత్రల్లో ఇట్టే ఒదిగిపోతారు. అడపా దడపా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్న ఈ నటి రీసెంట్‌గా కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు.

Satya Krishnan
Satya Krishnan : అక్క, వదిన పాత్రలు అనగానే గుర్తుకు వచ్చే యాక్ట్రెస్‌లో సత్య కృష్ణన్ ఒకరు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల ‘డాలర్ డ్రీమ్స్’ సినిమాతో నటిగా మారిన సత్య కృష్ణన్ రీసెంట్ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సత్య కృష్ణన్ నటి కాకముందు హోటల్ మేనేజ్మెంట్ చదువుకుని తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో జాబ్ చేసేవారట. ఓసారి అనుకోకుండా శేఖర్ కమ్ముల దృష్టిలో పడి 2000 సంవత్సరంలో ‘డాలర్ డ్రీమ్స్’ సినిమాలో అవకాశం సంపాదించారు. అలా నటిగా మారిన సత్య కృష్ణన్‌కి మరల శేఖర్ కమ్ముల ‘ఆనంద్’ సినిమాలో కూడా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాకి ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు కూడా గెలచుకున్నారు సత్య కృష్ణన్. తన జాబ్ వదిలిపెట్టి పూర్తిగా నటనపైనే దృష్టి పెట్టిన సత్య కృష్ణన్ తర్వాత బొమ్మరిల్లు, మొదటి సినిమా, వినాయకుడు,మెంటల్ కృష్ణ, దేవదాస్, సౌఖ్యం, ఒక్కడినే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, గాలోడు, అసలు వంటి సినిమాల్లో నటించారు. రీసెంట్‌గా దూత వెబ్ సిరీస్‌లో కూడా నటించారు. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు.
Kalki 2898 AD : కల్కి 9 భాగాలుగా రాబోతుంది.. యాక్టర్ అభినవ్ గోమఠం కామెంట్స్..
కాస్టింగ్ కౌచ్ ఎక్కడైనా ఉందని.. అది ఎదురైనపుడు ఆడవాళ్లు తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవాలన్నారు సత్య కృష్ణన్. ఎవరైనా లిమిట్స్ క్రాస్ చేస్తుంటే ధైర్యంగా చెప్పాలని అన్నారు. కమిట్‌మెంట్‌కి ఒప్పుకోకపోతే క్యారెక్టర్ రాదనే భయంతో కొందరు లొంగిపోతుంటారని అది కరెక్ట్ కాదని సత్య కృష్ణన్ అన్నారు. తనకి అలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదని.. ఆ పరిస్థితి ఎదుర్కొన్న వాళ్లను ప్రత్యక్షంగా చూసానని ఆమె చెప్పారు. సినిమాలు తప్ప వేరే లైఫ్ లేదనుకుని వచ్చిన వాళ్లకి నిజంగా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కోవడం కష్టమే అయినా అదే సమయంలో తమని తాము కాపాడుకోవాలంటే ధైర్యంగా ఉండాలంటూ సత్య కృష్ణన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సత్య కృష్ణన్ ఒకవైపు నటిగా కొనసాగుతూనే డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. భవిష్యత్‌లో డైరెక్షన్ కూడా చేయాలని ఉంది సత్య కృష్ణన్ చెప్పారు.