Surekha Vani : సురేఖా వాణికి పాజిటివ్..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి తనకు కరోనా సోకినట్లు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు..

Surekha Vani : సురేఖా వాణికి పాజిటివ్..

Surekha Vani

Updated On : January 30, 2022 / 12:12 PM IST

Surekha Vani: కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసిరింది. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్.. వాటివల్ల ఏర్పడ్డ పాండమిక్ కారణంగా జనాలు పడ్డ ఇబ్బుందులు మర్చిపోకముందే థర్డ్ వేవ్ వచ్చి పడింది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు థర్డ్ వేవ్‌ బారిన పడ్డారు.

Anna Ben : పాపులర్ నటికి కరోనా..

రీసెంట్‌గా పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి తనకు కరోనా సోకినట్లు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ‘మై పాజిటివ్ ఫేస్’ అంటూ మాస్క్ ధరించిన పిక్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ పెట్టింది. కో ఆర్టిస్టులు హేమ, సన, రజిత, విజయలక్ష్మీలతో కలిసి ఉన్న ఓల్డ్ పిక్ షేర్ చేస్తూ త్వరలో కలుద్దామంటూ కామెంట్ చెప్పుకొచ్చింది.

Surekha Vani Tested Positive

ఇటీవల సూపర్‌స్టార్ మహేష్ బాబు కోవిడ్ బారినపడి కోలుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్, మలయాళ నటుడు జయరామ్ (‘అల..వైకుంఠపురములో’, ‘రాధే శ్యామ్’ ఫేమ్), మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ తదితరులు కోవిడ్ సోకడంతో క్వారంటైన్‌లో ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Surekhavani (@artist_surekhavani)