Anna Ben : పాపులర్ నటికి కరోనా..

యంగ్ అండ్ టాలెంటెడ్ మలయాళీ యాక్ట్రెస్ అన్నా బెన్ కోవిడ్ బారినపడింది..

Anna Ben : పాపులర్ నటికి కరోనా..

Anna Ben

Updated On : January 20, 2022 / 3:58 PM IST

Anna Ben: ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌తో కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం గురించి పూర్తిగా మర్చిపోకముందే ఇప్పుడు థర్డ్ వేవ్ ప్రపంచాన్ని వణికించేస్తోంది. వైరస్‌కి సామాన్యులు, సెలబ్రిటీ అనే తేడా తెలియదు కదా.. సో, ఇప్పటికే ఎంతోమంది థర్డ్ వేవ్‌లో కరోనా బారినపడ్డారు.

Priyanka Jawalkar : ‘టాక్సీవాలా’ హీరోయిన్‌కి కోవిడ్..

బుధవారం తెలుగు యాక్ట్రెస్, ‘టాక్సీవాలా’ ఫేం ప్రియాంక జవాల్కర్‌కి కూడా కోవిడ్ సోకింది. ఈ విషయం మర్చిపోకముందే మరో నటి కూడా కరోనా బారిన పడింది. యంగ్ అండ్ టాలెంటెడ్ మలయాళీ యాక్ట్రెస్ అన్నా బెన్ తనకు కోవిడ్ వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

Anna Ben Tested Positive

 

‘కుంబళంగి నైట్స్’, ‘హెలెన్’, ‘కప్పెల’, ‘సారా’స్’ వంటి మలయాళం సినిమాలతో టాలెంటెడ్ నటిగా ప్రూవ్ చేసుకుంది అన్నా బెన్. వాసన కోల్పోవడంతో సహా పలు లక్షణాలతో పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయిందని.. ఇటీవల కాలంలో తనతో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్లు కూడా టెస్టులు చేయించుకోవాలని, ఈ సమయంలో హోమ్ క్వారంటైన్‌లో ఉండడమే మంచిదని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది అన్నా బెన్. ఆమె త్వరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు.

Mammootty : మలయాళం స్టార్ హీరో మమ్ముట్టికి కరోనా