Tripti Dimri : బిజినెస్ మ్యాన్‌తో ఆ నటి సీక్రెట్ లవ్ నిజమేనా?

యానిమల్ స్టార్ తృప్తి డిమ్రీ ఒక బిజినెస్ మ్యాన్‌తో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా వారిద్దరి సోషల్ మీడియా పోస్టులు చూసాక ఈ పుకార్లు మొదలయ్యాయి.

Tripti Dimri : బిజినెస్ మ్యాన్‌తో ఆ నటి సీక్రెట్ లవ్ నిజమేనా?

Tripti Dimri

Updated On : February 23, 2024 / 7:37 PM IST

Tripti Dimri : బాలీవుడ్ నటి తృప్తి డిమ్రీకి ‘యానిమల్’ సినిమా తర్వాత మంచి పేరు వచ్చింది. రీసెంట్‌గా తృప్తి ఒక బిజినెస్ మ్యాన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Maruva Tarama : ‘మరువ తరమా’ నుంచి ‘పరవశమే పరవశమే..’ మెలోడీ సాంగ్ విన్నారా?

సందీప్ రెడ్డి వంగా సినిమా ‘యానిమల్’ తో తృప్తి డిమ్రీకి ఫుల్ పాపులారిటీ వచ్చింది.  మామ్, పోస్టర్ బాయ్స్, బుల్ బుల్, కాలా వంటి బాలీవుడ్  సినిమాల్లో చేసినా రాని గుర్తింపు యానిమల్ తెచ్చిపెట్టింది. గతంలో తృప్తి అనుష్క శర్మ తమ్ముడు కర్నేశ్ శర్మతో రిలేషన్‌లో ఉందని వార్తలు వచ్చాయి. రీసెంట్‌గా తృప్తి డిమ్రీ సామ్ మర్చంట్ అనే బిజినెస్ మ్యాన్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

తృప్తి డిమ్రీ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ ఫంక్షన్‌లో పాల్గొన్న కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అయితే సామ్ మర్చంట్‌తో దిగిన ఫోటోలు చూసిన తర్వాత వీరిద్దరూ లవ్ బర్డ్స్ అంటూ గాసిప్స్ మొదలయ్యాయి. సామ్ మర్చంట్ గోవాలో వాటర్స్ బీర్ లాంజ్ & గ్రిల్ ఫౌండర్‌గా అతని ఇన్‌స్టాగ్రామ్ బయో సూచిస్తోంది. 2 లక్షల 49 వేలకు పైగానే ఫాలోవర్లు ఉన్నసామ్ మర్చంట్ ఖాతాను తృప్తి డిమ్రీతో పాటు టైగర్ ష్రాఫ్, దిశా పటానీలు ఫాలో అవుతున్నారు.

Shamita Shetty : 50 ఏళ్లు వచ్చిన పెళ్లి కాలేదు? అన్న నెటిజన్ ప్రశ్నకి ఆ నటి ఇచ్చి పడేసిందిగా

ఇటీవల తృప్తి బర్త్ డే సందర్భంలో కూడా సామ్ మర్చంట్ ‘హ్యాపీ బర్త్ డే డియరెస్ట్ తృప్తి’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టారు. ఇక దీంతో వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వీరి మధ్య ఏమున్నది ఈ జంట క్లారిటీ ఇచ్చేవరకు గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి.

 

Tripti Dimri

Tripti Dimri