Varalaxmi Sarathkumar Wedding : ఘనంగా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి.. ఫోటోలు వైర‌ల్..!

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

Varalaxmi Sarathkumar Wedding : ఘనంగా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి.. ఫోటోలు వైర‌ల్..!

Actress Varalaxmi Sarathkumar wedding pics viral

Updated On : July 11, 2024 / 8:45 PM IST

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాల‌రీ నిర్వాహ‌కుడు నికోలాయ్ సచ్‌దేవ్ ను పెళ్లి చేసుకుంది. థాయ్‌లాండ్‌లోని ఓ బీచ్ రిసార్ట్‌లో జూలై 10న‌ వీరి వివాహం ఘ‌నంగా జ‌రిగింది. ఇరు కుటుంబ స‌భ్యులు, బంధువులు, అతి కొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో వీరి పెళ్లి జ‌రిగింది. నూత‌న దంప‌తుల పెళ్లి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కొత్త జంట‌కు నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. కాగా.. మార్చి 1న వీరి ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

14 ఏళ్ల క్రితం వ‌ర‌ల‌క్ష్మి, నికోలాయ్ స‌చ్‌దేవ్ లు ఒక‌రికొక‌రు ప‌రిచ‌యం అయ్యారు. వారి ప‌రిచ‌యం క్ర‌మంగా స్నేహంగా మారింది. ఆ త‌రువాత ప్రేమ‌గా మారింది. ఇరువురు పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కాగా.. వ‌రల‌క్ష్మికి ఇది మొద‌టి మ్యారేజ్ కాగా నికోలాయ్‌కు ఇది రెండో వివాహం. నికోలాయ్‌కు 15 ఏళ్ల వ‌య‌సు ఉన్న కూతురు ఉంద‌ట‌.

Mohan babu : అపురూప రాజదండం అందుకున్న మోహ‌న్ బాబు.. ఎవ‌రు ఇచ్చారో తెలుసా..?

ఇక ఈ విష‌యం గురించి గ‌తంలో వ‌ర‌ల‌క్ష్మి మాట్లాడుతూ.. ‘14 ఏళ్ల క్రితం ఓ సందర్భంలో నికోలాయ్ తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. మాది తొలిప్రేమ అని చెప్పను కానీ.. క్రమంగా ఇద్దరం ప్రేమలో పడ్డాం.. ఒకరినొకరం అర్థం చేసుకున్నాం.. అన్ని విషయాల్లో తోడుగా నిలిచాం. అయితే నికోలయ్‌ మొదటి వివాహం గురించి కొందరు విమర్శించారు. నా దృష్టిలో రెండో పెళ్లి తప్పు కాదు. అలాగే నికోలయ్‌ అందాన్ని చూసి నేను ప్రేమించలేదు. అతడి అందమైన మనసు చూసి ప్రేమించా. తను చాలా మంచివాడు. నన్నెంతో ప్రేమగా చూసుకుంటాడు. నార్వేలో నార్తర్న్‌ లైట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో కుటుంబ సభ్యులందరి ముందు అతడు నాకు ప్రపోజ్‌ చేయడం నేనెప్పటికీ మర్చిపోలేను.’ అని వ‌ర‌ల‌క్ష్మి చెప్పింది.

Raj Tarun : రాజ్ తరుణ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు.. 10టీవీతో లావ‌ణ్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..