Mohan babu : అపురూప రాజదండం అందుకున్న మోహ‌న్ బాబు.. ఎవ‌రు ఇచ్చారో తెలుసా..?

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు 550కి పైగా మూవీల్లో న‌టించి మెప్పించారు

Mohan babu : అపురూప రాజదండం అందుకున్న మోహ‌న్ బాబు.. ఎవ‌రు ఇచ్చారో తెలుసా..?

Mohan Babu received the Apurupa Raja Dandam

Mohan babu – Raja Dandam : క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు 550కి పైగా మూవీల్లో న‌టించి మెప్పించారు. విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, హీరోగా త‌న‌దైన శైలిలో న‌టించి ప్రేక్ష‌కుల గుండెల్లో చెద‌ర‌ని ముద్ర వేశారు. ఆయ‌న డైలాగ్ డెలివ‌రీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కాగా.. తాజాగా ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఓ ఫోటోను అభిమానుల‌తో పంచుకున్నారు. ఆ ఫోటోలో ఆయ‌న ఓ రాజ‌దండాన్ని త‌న చేతిలో ప‌ట్టుకుని క‌నిపిస్తున్నారు.

ఎంతో అపురూప రాజదండం అందడం త‌న పూర్వ‌జ‌న్మ సుకృతం అని చెప్పారు. అయితే.. ఈ రాజ‌దండం ఎలా వ‌చ్చింది, ఎవ‌రు ఇచ్చారు అన్న విష‌యాల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు. ‘ఎంతో చారిత్రక ప్రాధాన్యం గల అపురూప రాజదండం అందడం పూర్వజన్మ సుకృతం.. ఈ రాజ దండం ఎలా వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో అతి త్వరలో వివరాలు తెలియజేస్తా.’ అని ఎక్స్ లో రాసుకొచ్చారు.

Raj Tarun : రాజ్ తరుణ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు.. 10టీవీతో లావ‌ణ్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. మంచు విష్ణు హీరోగా తెర‌కెక్కుతున్న’క‌న్న‌ప్ప’ మూవీలో మోహ‌న్ బాబు ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆయ‌న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కూడా. ముకేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రంలో మధుబాల, ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్ ఇలా చాలా మంది స్టార్స్ న‌టిస్తున్నారు.