Vijayashanthi : ప‌వ‌న్ భార్య పై ట్రోల్స్‌.. విజ‌య‌శాంతి ఫైర్‌..

అన్నా లెజినోవా పై వ‌స్తున్న ట్రోల్స్ పై న‌టి విజ‌య‌శాంతి స్పందించారు.

Vijayashanthi : ప‌వ‌న్ భార్య పై ట్రోల్స్‌.. విజ‌య‌శాంతి ఫైర్‌..

Actress Vijayashanthi serious on trolls about AP Deputy CM Pawan Kalyan wife anna lezhinova

Updated On : April 16, 2025 / 11:51 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి పవన్ కళ్యాణ్ భార్య‌ అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని ద‌ర్శ‌నం చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌న కొడుకు మార్క్ శంక‌ర్ ప్ర‌మాదం నుంచి క్షేమంగా బ‌య‌ట‌ప‌డ‌డంతో అన్నా లెజినోవా తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకుంది. ఆల‌య నియ‌మ‌నిబంధ‌న‌లు పాటిస్తూ డిక్ల‌రేష‌న్ ఇచ్చారు.

హిందూ సంప్ర‌దాయాలు, ఆచారాల‌ను పాటిస్తూ శ్రీవారికి మొక్కు చెల్లించుకున్నారు. త‌ల‌నీలాలు స‌మ‌ర్పిచారు. నిత్యాన్న‌దానం కోసం రూ.17ల‌క్ష‌ల విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా భ‌క్తుల‌తో క‌లిసి నిత్యాన్న‌దానంలో పాల్గొన్నారు.

Nani : కొంతమంది ఆడియన్స్ ని దూరం చేసుకుంటున్న నాని.. మార్చుకోమంటున్న ఫ్యాన్స్..

విదేశాల్లో పుట్టిపెరిగిన అన్నా లెజినోవా.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం, క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ ధర్మాన్ని అనుసరించడంతో ఆమె పై ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అయితే కొందరు మాత్రం ఆమె తీరును త‌ప్ప‌బ‌డుతున్నారు. క్రిస్టియ‌న్ అయి ఉండి తిరుమ‌ల‌కు ఎందుకు వెళ్లారు? త‌ల‌నీలాలు ఎందుకు ఇచ్చారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అన్నా లెజినోవా పై వ‌స్తున్న ట్రోల్స్ పై న‌టి విజ‌య‌శాంతి మండిప‌డ్డారు.

OG Song : పవన్ OG ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన తమన్.. సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయో కూడా చెప్పి..

‘దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు.’ అని సోషల్ మీడియాలో విజ‌య‌శాంతి రాసుకొచ్చారు.