Nani : కొంతమంది ఆడియన్స్ ని దూరం చేసుకుంటున్న నాని.. మార్చుకోమంటున్న ఫ్యాన్స్..
ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు కొంత యూత్ ఆడియన్స్ కూడా కాస్త నానికి దూరం జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

Nani avoiding Family Audience and Children for his Mass Image
Nani : హీరో నాని అంటే న్యాచురల్ స్టార్. ఏ సినిమా చేసినా చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మొదలుకొని టీనేజర్స్ వరకు నాని సినిమా అంటే అందరూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. నాని సినిమా ఏదైనా సరే హిట్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే చూడటానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఆయన సినిమాలు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.
ఈగ నుండి మొదలుకొని సరిపోదా శనివారం వరకు నాని డిఫరెంట్ మూవీస్ నే చేసాడు. నాని సినిమాలో ఎంతో కొంత ఫ్యామిలీ టచ్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు చూస్తుంటే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు కొంత యూత్ ఆడియన్స్ కూడా కాస్త దూరం జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.
Also Read : OG Song : పవన్ OG ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన తమన్.. సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయో కూడా చెప్పి..
హిట్-3 ట్రైలర్ రిలీజ్ అయ్యాక నానినే డైరెక్ట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇంత వయొలెన్స్ అంటే ప్రేక్షకులు థియేటర్ కు వస్తారా? అని ప్రశ్నిస్తే క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు రావొద్దని డైరెక్ట్ గానే చెప్పాడు. అంతే కాదు తరువాత వచ్చే సినిమా ప్యారడైజ్ లో కూడా వయొలెన్స్ ఎక్కువ ఉండడంతో దానిపైనా చాలా ఎఫెక్ట్ పడే అవకాశాలున్నాయంటున్నారు. ఆల్రెడీ ప్యారడైజ్ నుంచి రిలీజయిన గ్లింప్స్ లో ఓ బూతు పదాన్ని హైలెట్ చేయడం చర్చగా మారింది.
దీంతో ఈ రెండు సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారా అని ప్రశ్న తలెత్తుతుంది. నానినే డైరెక్ట్ గా రావొద్దు అని చెప్పడంతో ఇలా అయితే ఎలా అని ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే వరుస 100 కోట్ల సినిమాల హీరోగా మారుతున్న నాని తనని ఇంతటివాడిని చేసిన ఫ్యామిలీ ఆడియన్స్ ని తన సినిమాలు చూడొద్దు అంటుంటే ఏం అనాలో అర్ధం కావట్లేదంట ఫ్యాన్స్ కి.
Also Read : Thaman : వామ్మో.. తమన్ దగ్గర అన్ని షూ పెయిర్స్ ఉన్నాయా..? తమన్ దగ్గర ఉన్న ఖరీదైన షూ ఎన్ని లక్షలో తెలుసా?
నాని మాస్ ఇమేజ్ కోసం ఇంత వయొలెన్స్ అవసరమా అని నాని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మన సినిమాలు కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉండాలని చెపుతున్నారట. మరి నాని ఫ్యాన్స్ మాట విని కుటుంబసమేతంగా చూసే సినిమాలే చేస్తారా లేక తనకు నచ్చినట్లుగానే మాస్ ఇమేజ్ కోసం వైలెన్స్ తో ముందుకెళ్తారా అనేది చూడాలి. ఇక నాని హిట్ 3 సినిమా మే 1న రిలీజ్ కానుంది.