Devadatta Nage : మహేష్ మేనల్లుడి కోసం రాబోతున్న ఆదిపురుష్ హనుమాన్.. ఈసారి ‘కంసరాజు’గా..

మొదటి సినిమాలో అశోక్ లవర్ బాయ్ లా క్యూట్ గా కనిపిస్తే, ఈ సినిమాలో నాటుగా కనిపించనున్నాడు. ఫుల్ యాక్షన్ మూవీగా ఈ సినిమాని అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రని పరిచయం చేశారు.

Devadatta Nage : మహేష్ మేనల్లుడి కోసం రాబోతున్న ఆదిపురుష్ హనుమాన్.. ఈసారి ‘కంసరాజు’గా..

Adipurush Hanuman Character Fame Devadatta Nage playing Villain role in Ashok Galla Second Movie

Updated On : October 21, 2023 / 11:15 AM IST

Devadatta Nage : ‘హీరో’ (Hero) సినిమాతో టాలీవుడ్ కి పరిచమైన హీరో అశోక్ గల్లా (Ashok Galla). మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే పర్వాలేదనిపించారు. ఇటీవల కొన్ని నెలల క్రితం అశోక్ గల్లా రెండో మూవీని కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమా టైటిల్ ఇంకా ప్రకటించకపోయినా ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ చేశారు. మొదటి సినిమాలో అశోక్ లవర్ బాయ్ లా క్యూట్ గా కనిపిస్తే, ఈ సినిమాలో నాటుగా కనిపించనున్నాడు. ఫుల్ యాక్షన్ మూవీగా ఈ సినిమాని అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రని పరిచయం చేశారు. బాలీవుడ్ నటుడు, ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడి క్యారెక్టర్ లో మెప్పించిన దేవదత్త నాగేను అశోక్ గల్లా రెండో సినిమాలో విలన్ గా తీసుకొచ్చారు. ఈ సినిమాలో కంసరాజు అనే నెగిటివ్ పాత్రని పోషించబోతున్నాడు దేవదత్త. దేవదత్త పవర్ ఫుల్ గా కత్తి పట్టుకున్న ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. త్వరలోనే టీజర్, టైటిల్ ని ప్రకటిస్తామని తెలిపారు చిత్రయూనిట్.

Also Read : Bhagavanth Kesari : రెండు రోజుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేసిన బాలయ్య.. అదరగొడుతున్న భగవంత్ కేసరి కలెక్షన్స్..

ఇక ఈ సినిమాకి టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథని ఇవ్వగా స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నాడు. హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారు అన్నది ఇంకా తెలియజేయలేదు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఈ సినిమాతో దేవదత్త నాగే తెలుగులో విలన్ గా బిజీ అవుతాడేమో చూడాలి మరి.