పవన్ కళ్యాణ్ డిజాస్టర్ మూవీ.. హిందీలో సూపర్ హిట్

రాజకీయాల్లోకి పూర్తిగా వచ్చేసే ముందు చివరిగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన సినిమా ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 25వ సినిమాగా రూపొందిన అజ్ఞాతవాసి 2018 సంక్రాంతికి విడుదలైంది. బాక్సాఫీస్ కలెక్షన్లు పెద్దగా రాబట్టలేకపోయిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.
అయితే ఈ సినిమా హిందీ డబ్బింగ్ మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తుంది. ‘ఎవడు 3’ పేరుతో యూట్యూబ్‌లో విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు 100 మిలియన్ వ్యూస్‌ను అంటే 10కోట్లకు పైగా వ్యూస్ దక్కించుకుని రికార్డ్‌ను క్రియేట్ చేసింది. కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు బాలీవుడ్ జనం జై కొట్టేశారు.