మణిరత్నం సినిమాలో ఐశ్వర్యది నెగటివ్ రోల్!

  • Published By: madhu ,Published On : February 15, 2020 / 09:57 PM IST
మణిరత్నం సినిమాలో ఐశ్వర్యది నెగటివ్ రోల్!

Updated On : February 15, 2020 / 9:57 PM IST

ప్రముఖ దర్శకుడు మణిరత్నం కలల ప్రాజెక్టు ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో అందాల నటి ఐశ్వర్య రాయ్ నెగటివ్ పాత్రలో నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఐష్..భర్తను తప్పుదోవ పట్టించే విధంగా..చోళుల పతనానికి కారణమయ్యే నందిని పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. ప్రిన్స్ ఆదిత్య కరికలన్ పాత్రలో విక్రమ నటిస్తున్నారు. వీరిమధ్య చాలా సన్నివేశాలున్నట్లు టాక్. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్‌లో విక్రమ్, శోభిత, ఐశ్వర్య రాయ్‌లు పాల్గొన్నారు. 

గతంలో వీరిద్దరూ..రావణ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య రాయ్‌తో పాటు..శోభిత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దక్షిణాదికి చెందిన నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరిలో కార్తీ, త్రిష, జయం రవి తదితరులున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన థాయిలాండ్‌లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. 10, 11 శతాబ్దంలో చోళ రాజవంశంలో చోటు చేసుకున్న పరిణామాలను తెరకు ఎక్కిస్తున్నారు.

సినిమా రెండు భాగాలుగా ఉండనుంది. ఫస్ట్ పార్ట్ 2021లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ కథను వెండి తెరపై ఆవిష్కరించడం తన కల అని పలు సందర్భాల్లో మణిరత్నం వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో చిత్రం రూపొందుతోంది. షూటింగ్ సందర్భంగా..చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
చోళ సామ్రాజ్యం 13వ శతాబ్దం వరకు ప్రధానంగా దక్షిణ భారతదేశాన్ని తమిళ సామ్రాజ్యం పరిపాలించింది.

కావేరీ నది పరివాహక ప్రాంతాల్లో పుట్టి దక్షిణ భారతదేశం అంతా విస్తరించింది. రాజరాజ చోళుడు భారతదేశంలోని దక్షిణ ద్వీపకల్ప భాగాన్ని, శ్రీలంకలోని కొన్ని భాగాలు, మాల్దీవులకు తమ సామ్రాజాన్ని విస్తరించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత రెహమాన్ అందిస్తున్న ఈ సినిమా..బాహుబలి స్థాయి చిత్రాన్ని మించి ఉంటుందని టాక్. 

Read Here>>కరోనా మరణ శాసనం: మరో 143మంది మృతి.. ఒడిశాలో 74మందిపై..