Ajay Bhupathi: నిర్మాతగా మారుతున్న RX100 డైరెక్టర్.. బ్యానర్ పేరు ఏమిటంటే..?

‘RX100’ సినిమాతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోహీరోయిన్లుగా నటించగా, బోల్డ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా విజయాన్ని అందుకుంది ఈ మూవీ. ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కట్టడంతో అజయ్ భూపతి ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయాడు. అయితే ఆ సినిమా తరువాత ‘మహాసముద్రం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అజయ్ భూపతి.

Ajay Bhupathi: నిర్మాతగా మారుతున్న RX100 డైరెక్టర్.. బ్యానర్ పేరు ఏమిటంటే..?

Ajay Bhupathi Turns Producer With Announcing His Production Banner

Updated On : January 10, 2023 / 6:56 PM IST

Ajay Bhupathi: ‘RX100’ సినిమాతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోహీరోయిన్లుగా నటించగా, బోల్డ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా విజయాన్ని అందుకుంది ఈ మూవీ. ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కట్టడంతో అజయ్ భూపతి ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయాడు. అయితే ఆ సినిమా తరువాత ‘మహాసముద్రం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అజయ్ భూపతి.

Ajay Bhupathi: మంగళవారం మరో RX 100 అంటోన్న డైరెక్టర్!

కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. దీంతో అజయ్ భూపతి ఇప్పుడు ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మళ్లీ సక్సెస్ అందుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. కాగా, తాజాగా అజయ్ భూపతి కొత్త సంవత్సరంలో మరో కొత్త అవతారం ఎత్తుతున్నట్లు ప్రకటించాడు. ‘ఎ క్రియేటివ్ వర్క్స్’ అనే బ్యానర్‌ను స్థాపించి, నిర్మాతగా కూడా సినిమాలు చేయబోతున్నాడట ఈ డైరెక్టర్. త్వరలోనే తన బ్యానర్‌లో ఓ మూవీని అనౌన్స్ కూడా చేస్తున్నట్లు అజయ్ భూపతి తెలిపారు.

Ajay Bhupathi : ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ డైరెక్టర్

ఇక దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న అజయ్ భూపతి, నిర్మాతగా ఎవరితో సినిమా చేస్తాడా.. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారా అనే ఆసక్తి ఆయన అభిమానుల్లో నెలకొంది. కాగా అజయ్ భూపతి డైరెక్ట్ చేయబోయే నెక్ట్స్ మూవీని ఎప్పుడు అనౌన్స్ చేస్తాడా అని RX100 లవర్స్ ఆతృతగా చూస్తున్నారు.