Akhil Akkineni: అఖిల్ సూపర్ స్టైలిష్ హార్స్ రైడ్.. వీడియో వైరల్!

ఒక్క సక్సెస్ కొడితే లైఫ్ సెట్టైపోయే చరిష్మాగల హీరోలలో అఖిల్ కూడా ఒకడు. అందగాడే కానీ.. అందుకు తగ్గ అదృష్టం మాత్రం ఇంకా కలిసి రాలేదు. దాని కోసమే అఖిల్ ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. తనను తాను మార్చుకొని హాలీవుడ్ హీరోలా మారి గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు.

Akhil Akkineni: అఖిల్ సూపర్ స్టైలిష్ హార్స్ రైడ్.. వీడియో వైరల్!

Akhil Akkineni

Updated On : August 9, 2021 / 2:59 PM IST

Akhil Akkineni: ఒక్క సక్సెస్ కొడితే లైఫ్ సెట్టైపోయే చరిష్మాగల హీరోలలో అఖిల్ కూడా ఒకడు. అందగాడే కానీ.. అందుకు తగ్గ అదృష్టం మాత్రం ఇంకా కలిసి రాలేదు. దాని కోసమే అఖిల్ ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. తనను తాను మార్చుకొని హాలీవుడ్ హీరోలా మారి గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా షూటింగ్ లో ఉంది.

ఇప్పటికే ఈ స్పై థిల్లర్ లో అఖిల్ లుక్ అభిమానులను ఫిదా చేయగా.. ప్రేక్షకులకు ఆశ్చర్యంగా కనిపించింది. సిక్స్ ప్యాక్ ను మించిన ఫిజిక్ తో అఖిల్ స్పెల్ బౌల్డ్ చేసేశాడు. ఇదిలా ఉండగానే అఖిల్ హార్స్ రైడ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న అఖిల్ సండే రోజు తన గిజెల్లేతో గడిపిన మూమెంట్స్ అంటూ కామెంట్ పెట్టాడు. ఈ ఫోటోలు, వీడియో ఇప్పుడు ఇండస్ట్రీ టాక్ గా మారింది.

నీళ్లలో కూడా సూపర్ స్టైలిష్ గా హార్స్ రైడ్ చేయడం చూస్తుంటే అఖిల్ కాన్ఫిడెంట్ లెవెల్ వేర్ రేంజిలో కనిపిస్తుంది. అఖిల్ హార్స్ రైడ్ చేసే వీడియోలు గతంలో కూడా వైరల్ కాగా.. ఈ వీడియో మాత్రం అభిమానులకు మరింత స్పెషల్ గా కనిపిస్తుంది. మరి.. ఈ ప్రాక్టీస్ కూడా ఏజెంట్ సినిమా కోసమా.. లేక సరదాగా చేసిందా అన్నది తెలియదు కానీ అఖిల్ వ్యవహారం చూస్తుంటే మాత్రం ఏజెంట్ సినిమా తన లక్ మార్చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Akhil Akkineni (@akkineniakhil)