Akkineni Family : ఢిల్లీ టీడీపీ ఆఫీస్ లో అక్కినేని ఫ్యామిలీ.. ఫోటో వైరల్.. తండేల్ రిలీజ్ పెట్టుకొని భార్యతో ఢిల్లీకి నాగ చైతన్య..
నంద్యాల ఎంపీ డా. బైరెడ్డి శబరి అక్కినేని ఫ్యామిలీతో దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Akkineni Family Photo shared by MP Dr Byreddy Shabari
Akkineni Family : నాగ చైతన్య నటించిన తండేల్ సినిమా నేడు రిలీజయింది. ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ చేసారు. అయితే నేడు తండేల్ సినిమా రిలీజ్ పెట్టుకొని నాగచైతన్య తన భార్య శోభిత, నాగార్జున, అమలలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ నుంచి అక్కినేని ఫ్యామిలీ ఫోటో వైరల్ గా మారింది. నంద్యాల ఎంపీ డా. బైరెడ్డి శబరి అక్కినేని ఫ్యామిలీతో దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
అక్కినేని ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి.. నేడు నాగార్జున, ఆయన ఫ్యామిలీని ఢిల్లీ పార్లమెంట్ లోని టీడీపీ ఆఫీస్ లో కలవడం జరిగింది అని రాసుకొచ్చారు. ఈ ఫొటోలో నాగార్జున, అమల, నాగ చైతన్య, శోభిత, బైరెడ్డి శబరి ఉన్నారు. ప్రస్తుతం ఈ అక్కినేని ఫ్యామిలీ ఫోటో వైరల్ గా మారింది.
Also Read : RGV : ఏ సినిమా ఫ్లాప్ అయినా పట్టించుకోని ఆర్జీవీ.. ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం బాధపడ్డాడు తెలుసా..
సడెన్ గా అక్కినేని ఫ్యామిలీ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు, అది కూడా తండేల్ రిలీజ్ పెట్టుకొని చైతు ఎందుకు వెళ్ళాడు అని చర్చగా మారింది. అయితే నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మీద రాసిన బుక్ లాంచ్ కోసమే అక్కినేని ఫ్యామిలీ ఢిల్లీకి వెళ్లినట్టు తెలుస్తుంది. ఢిల్లీలోని పలువురు రాజకీయ ప్రముఖుల చేతుల మీదుగా అక్కినేని నాగేశ్వరరావు బుక్ రిలీజ్ చేయనున్నారు అని సమాచారం.
Today, I met with the actor @iamnagarjuna garu and his family members at the TDP office in Delhi Parliament.@amalaakkineni1 @chay_akkineni pic.twitter.com/BnFlGkQ4cX
— Dr.Byreddy Shabari (@ByreddyShabari) February 7, 2025