ఆర్మీ డే : జవాన్లతో అక్షయ్ కుమార్ వాలిబాల్

ఆర్మీ డే : జవాన్లతో అక్షయ్ కుమార్ వాలిబాల్

Updated On : January 15, 2021 / 6:08 PM IST

Akshay Kumar Volleyball : ఆర్మీడేను ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, మార్షల్ ఆర్ట్ కళాకారుడు అక్షయ్ కుమార్ వినూత్నంగా జరుపుకున్నారు. 2021, జనవరి 15వ తేదీ శుక్రవారం ఉదయం జవాన్లతో కలిసి వాలీబాల్ గేమ్ ఆడారు. జవాన్లు వేసుకున్న డ్రెస్ ను అక్షయ్ ధరించి వారితో కలిసి ఆడారు. విపరీతమైన చలిలో వాలీబాల్ ఆడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అక్షయ్ కుమార్ నటిస్తున్న న్యూ మూవీ ‘బచ్చన్ పాండే’. ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్ లోని జైసల్మీర్ లో జరుగుతోంది.

ఆర్మీడేను పురస్కరించుకుని జవాన్లతో కాసేపు సరదాగా గడిపారు అక్షయ్. ధైర్యవంతులైన జవాన్లను కలవడం, ఆర్మీడే సందర్భంగా మారథాన్ ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అక్షయ్ కుమార్ తో పాటు హీరోయిన్ కృతి సనన్ కూడా పాల్గొన్నారు. ఫర్హద్ సామ్ జీ దర్శకత్వంలో సాజిద్ నదియావాలా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

అక్షయ్ కుమార్ తీరిక లేకుండా..సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే..మరో రెండు సినిమాల కోసం రెడీ అయిపోతున్నారు. కొన్ని రోజుల క్రితమే బెల్ బాటమ్ చిత్రీకరణనను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత..అంతరంగీ రే షూటింగ్ లో పాల్గొన్నారు. ఇప్పుడు బచ్చన్ పాండే కోసం సెట్ లో అడుగుపెట్టారు. గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నారు. సినిమా సెట్లో తన గెటప్ కు సంబంధించిన ఫొటోను ఇటీవలే అభిమానులతో పంచుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)