Pawan – Ali : పవన్ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పిన అలీ..

తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ కమెడియన్ అలీ చాలా మంచి స్నేహితులు. అయితే వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందంటూ కొంతకాలంగా కథనాలు వస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించాడు అలీ. ఈయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో 'అలీతో సరదాగా' నుంచి కొత్త ప్రోమోని విడుదల చేశారు నిర్వాహకులు. అయితే ఈ ఎపిసోడ్ తో ఈ టాక్ షోకి ముంగింపు పలకబోతున్నట్లు తెలియజేశారు మేకర్స్.

Pawan – Ali : పవన్ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పిన అలీ..

Ali comments on gap between him and pawan

Updated On : December 17, 2022 / 2:32 PM IST

Pawan – Ali : తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ కమెడియన్ అలీ చాలా మంచి స్నేహితులు. అయితే వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందంటూ కొంతకాలంగా కథనాలు వస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించాడు అలీ. ఈయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అలీతో సరదాగా’ నుంచి కొత్త ప్రోమోని విడుదల చేశారు నిర్వాహకులు. అయితే ఈ ఎపిసోడ్ తో ఈ టాక్ షోకి ముంగింపు పలకబోతున్నట్లు తెలియజేశారు మేకర్స్.

Pawan Kalyan : అన్‌స్టాపబుల్‌-2లో.. పవర్ స్టార్‌!

దీంతో ఈ షోని ఇప్పటివరకు విజయపథాన నడిపించిన అలీతోనే శుభం పలుకుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఎపిసోడ్ కి అలీ గెస్ట్‌గా, యాంకర్ సుమ వ్యాక్యతగా వ్యవహరించింది. “ఫారిన్ కంట్రీస్ లో కూడా ఈ షోకి అశేషమైన ప్రజాధారణ లభించింది. ఈ షో మొదటిగా మంచు లక్ష్మితోనే మొదలయింది, ఈ సందర్భంగా ఆమెకు కృతజ్ఞతలు. కొంచెం గ్యాప్ ఇస్తున్నాము. మళ్ళీ కొత్త సీజన్ తో మీ ముందుకు వస్తాము” అని తెలియజేశాడు అలీ.

ఇక పవన్ కళ్యాణ్ గారికి మీకు ఎందుకు గ్యాప్ వచ్చింది అన్న సుమ ప్రశ్నకు.. అలీ సూటిగా బదులిచ్చాడు. “గ్యాప్ లేదు, గ్యాప్ క్రియేట్ చేశారు” అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఆ గ్యాప్ ఎవరు క్రియేట్ చేశారు అనేది తెలియాలంటే, వచ్చే సోమవారం ప్రసారమయ్యే చివరి ఎపిసోడ్ చూసి తెలుసుకోవాల్సింది. మరి ఈ ఎపిసోడ్ తో పవన్ అలీ మధ్య ఉన్న విబేధాలకు ముగింపు పడుతుందా?