Alia Bhatt : మొదటి సినిమా కాబట్టి.. ప్రెగ్నెన్సీ ఉన్నా షూట్ కి వెళ్ళాను..
ఇటీవలే ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ టీజర్ రిలీజయింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను తెలిపింది అలియాభట్.

Alia Bhatt work for Hollywood movie in Pregnancy time
Alia Bhatt : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరోయిన్ అలియాభట్ అందరి హీరోయిన్స్ లా పెళ్లిని వాయిదా వేయకుండా కరెక్ట్ టైంలో రణబీర్(Ranbir Kapoor) ని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాకుండా ఒక పాపకు కూడా జన్మనించ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రెగ్నెన్సీ(Pregnancy) సమయంలో మాత్రం సినిమాలకు దూరంగా ఉన్న అలియా భట్ త్వరలో మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక అలియా మొదటిసారి ఓ హాలీవుడ్ సినిమా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ లో నటించింది.
అయితే ఈ సినిమాలో అలియాభట్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా నటించింది. గతంలో ఈ షూట్ లోని కొన్ని ఫొటోస్ లీక్ అవ్వడంతో ఆ ఫోటోలలో అలియా భట్ బేబీబంప్ తో ఉండటంతో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇటీవలే ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ టీజర్ రిలీజయింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను తెలిపింది.
అలియా భట్ మాట్లాడుతూ.. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ సినిమాలో కొన్ని సన్నివేశాలు సరిగ్గా రాకపోవడంతో వాటిని మళ్ళీ షూట్ చేయాలి అన్నారు. ఈ విషయం నాకు ప్రెగ్నెన్సీ వచ్చాక చెప్పారు. పెళ్లి తర్వాత నేను ఆ సినిమా షూట్ లో పాల్గొన్నాను. ఇది నా మొదటి హాలీవుడ్ సినిమా కాబట్టి వదులుకోవాలనుకోలేదు. అందుకే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా షూట్ కి వెళ్ళాను. పోర్చుగల్ లో ఆ షూట్ చేశారు. నేను ప్రగ్నెన్సీ అని తెలిసి చిత్రయూనిట్ నాకు అన్ని సౌకర్యాలు అమర్చారు. ఇది నా మోదటి యాక్షన్ సినిమా, అందుకే వదులుకోకూడదు అనుకోని ప్రగ్నెన్సీ వచ్చినా సినిమా చేశాను అని తెలిపింది.