Lakshmis NTR : హైకోర్టుకు ఏపీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం – వర్మ

  • Published By: madhu ,Published On : April 2, 2019 / 01:12 PM IST
Lakshmis NTR : హైకోర్టుకు ఏపీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం – వర్మ

Updated On : April 2, 2019 / 1:12 PM IST

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారని..భారీ నష్టాల్లో కూరుకపోయారని..తమకు న్యాయం చేయాలని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్‌తో కూడిన ఆల్ ఏపీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం హైకోర్టుకు వెళుతోందని దర్శకుడు వర్మ వెల్లడించారు. మార్చి 29వ తేదీన ఏపీ మినహాయించి ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ అయ్యింది. ఏపీలో ఎన్నికలు ఉండడం..ఓటర్లపై ప్రభావితం చూపుతుందని కొంతమంది కోర్టు మెట్లు ఎక్కడంతో స్టే విధించింది. 

ఏపీలో విడుదల కాకపోవడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆందోళన పడుతున్నారు. భారీ మొత్తానికి కొన్నారని..అయితే రిలీజ్ కాకపోవడంతో నష్టాల పాలవుతున్నట్లు వారు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది. రోజులు గడుస్తున్నా కొద్ది పైరసీ వచ్చే అవకాశం ఉందని..దీనివల్ల తాము మరింత నష్టపోతామంటున్నారు. వెంటనే రిలీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టుకు వెళుతున్నారు. 

ఇటీవలే ఏపీలో సినిమా రిలీజ్ విషయంలో స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నిర్మాత రాకేష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యవసరం కింద కేసును విచారించాలని పిటిషన్ వేయగా..దీనిని సుప్రీం తిరస్కరించింది. కేసును వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. సుప్రీం ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠ నెలకొంది. 
Read Also : పౌరుషం అంటే ప్యాకేజీకి అమ్ముడుపోవడమా : పవన్‌కు ప్రశ్న