Evaru Meelo Koteeswarulu: హీరోలంతా ఒక్కటే.. అందరినీ గేదర్ చేస్తున్న తారక్!

తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం అటు డ్రగ్స్ ఇష్యూతో పాటు ఇటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ తో హాట్ హాట్ గా ఉంది. అంతేకాదు.. షూటింగులు, డిలే అయిన సినిమాలు..

Evaru Meelo Koteeswarulu: హీరోలంతా ఒక్కటే.. అందరినీ గేదర్ చేస్తున్న తారక్!

Evaru Meelo Koteeswarulu

Updated On : September 24, 2021 / 9:06 AM IST

Evaru Meelo Koteeswarulu: తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం అటు డ్రగ్స్ ఇష్యూతో పాటు ఇటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ తో హాట్ హాట్ గా ఉంది. అంతేకాదు.. షూటింగులు, డిలే అయిన సినిమాలు, రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలు.. ఇలా రకరకాల కష్టాల్లో సినిమావాళ్లందరూ ఉన్నారు. అందుకే ఎన్టీఆర్ అనఫీషియల్ గా టాలీవుడ్ సహకార సంఘాన్ని స్టార్ట్ చేసి అందర్నీ గేదర్ చేస్తున్నారు.

Maro Prasthanam: ఓన్లీ ఫర్ యాక్షన్ ఫిల్మ్ లవర్స్!

ప్రజెంట్ టాలీవుడ్ లో అందరూ ఒకరికొకరం అనుకుంటూసాయం చేసుకుంటున్నారు. ఒకరి షోకి మరొకరు అటెండ్ అవుతూ, ఒకరి షూటింగ్ స్పాట్ కి మరొకరు వస్తూ.. తమ మధ్య ఉన్న ఫ్రెండ్లీ బాండ్ ని చూపిస్తున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోకి వరుసగా టాప్ స్టార్స్ వస్తూ.. మేం మేం ఒకటే అని చెబుతున్నారు.

Love Story: ఇంటెన్స్ లవ్.. ఫీల్‌గుడ్ రొమాన్స్‌తో లవ్ స్టోరీ!

ఎన్టీఆర్ తో పాటు స్టార్ హీరోలందరూ ఈ మధ్య బాగా క్లోజ్ గా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోకి ఫస్ట్ చరణ్ ని ఇన్వైట్ చేశారు ఎన్టీఆర్. ట్రిపుల్ ఆర్ సినిమా కోసం 3 ఏళ్ల నుంచి కలిసి ట్రావెల్ అయిన ఈ ఇద్దరికీ మంచి బాండింగ్ సెట్ అయిపోయింది.

Bigg Boss 5: ఎలిమినేషన్‌లో ఐదుగురు.. లహరికి డేంజర్ తప్పదా?

జస్ట్ చరణ్ తోనే కాకుండా సూపర్ స్టార్ ని కూడా తన షోకి రప్పించారు ఎన్టీఆర్. ఇప్పటి వరకూ పెద్దగా ఎలాంటి షోస్ కీ అటెండ్ అవ్వని మహేష్ బాబు.. ఎన్టీఆర్ షోలో ప్రత్యక్షం అయ్యారు. అంతేకాదు హాట్ సీట్ లో కూర్చుని ఎన్టీఆర్ అడిగిన క్వశ్చన్స్ కి కరెక్ట్ సమాధానం చెప్పి 25 లక్షలు గెలుచుకున్నారు కూడా .

Big Boss 5: ప్రేమ కథలు, బ్రేకప్ స్టోరీలు.. ఎమోషనల్‌గా మారిన ఎపిసోడ్

ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్, సూపర్ స్టార్ తో పాటు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని కూడా పట్టుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు. రేటింగ్ లో దూసుకుపోతున్న తన షోకి ప్రభాస్, బన్నీని తీసుకొచ్చి.. స్టార్ హీరోలంతా ఒకరికోసం ఒకరు అని ఆడియన్స్ కి చూపించాలనుకుంటున్నారు ఎన్టీఆర్.