అల్లు అరవింద్‌కు ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డ్‌

  • Published By: veegamteam ,Published On : January 20, 2020 / 11:41 PM IST
అల్లు అరవింద్‌కు ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డ్‌

Updated On : January 20, 2020 / 11:41 PM IST

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌.. ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌ అవార్డ్‌ను అందుకున్నారు. ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ .. అరవింద్‌కు అవార్డ్‌ ప్రదానం చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సహా సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకుగాను .. అవార్డు అందుకున్నారు.

అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీకి అల్లు అరవింద్‌ ధన్యవాదాలు తెలిపారు. అవార్డులు కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయన్నారు. భవిష్యత్తులోనూ సమాజం కోసం తన సేవలు కొనసాగిస్తానన్నారు.