గల్ఫ్ మ్యాగజైన్‌పై బన్నీ
'గల్ఫ్ న్యూస్ టాబ్లాయిడ్' 'ఐ ఆన్ ది ప్రైజ్' అనే టైటిల్‌తో ఏప్రిల్ నెల మ్యాగజైన్ కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫోటో ప్రింట్ చేస్తూ, తన గురించి స్పెషల్ ఆర్టికల్ ఒకటి రాసింది..

‘గల్ఫ్ న్యూస్ టాబ్లాయిడ్’ ‘ఐ ఆన్ ది ప్రైజ్’ అనే టైటిల్‌తో ఏప్రిల్ నెల మ్యాగజైన్ కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫోటో ప్రింట్ చేస్తూ, తన గురించి స్పెషల్ ఆర్టికల్ ఒకటి రాసింది..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి తెలుగుతో పాటు, మలయాళంలోనూ ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ మనోణ్ణి ‘మల్లు అర్జున్’ అని పిలుస్తుంటారు. ఇప్పుడు బన్నీ క్రేజ్ ఇంకొంచెం పెరిగింది. ఈసారి ఏకంగా గల్ఫ్ మ్యాగజైన్ కవర్ పేజ్‌పై బన్నీ ఫోటో ప్రింట్ అవడం విశేషం. ‘గల్ఫ్ న్యూస్ టాబ్లాయిడ్’ ‘ఐ ఆన్ ది ప్రైజ్’ అనే టైటిల్‌తో ఏప్రిల్ నెల మ్యాగజైన్ కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫోటో ప్రింట్ చేస్తూ, తన గురించి స్పెషల్ ఆర్టికల్ ఒకటి రాసారు. ఫ్యూచర్‌లో హిందీతో పాటు మిగతా భాషల్లోనూ సినిమాలు చెయ్యాలనుకుంటున్నట్టు బన్నీ చెప్పాడు.
ఆర్య, రేసుగుర్రం, సరైనోడు సినిమాలు తన కెరీర్‌ని మార్చేసాయని, సుకుమార్ సౌత్ ఇండియాలోని టాలెంటెడ్ డైరెక్టర్ అని, ఆయనతో మూడవ సినిమా చెయ్యడానికి ఎదురు చూస్తున్నాననీ, నాగత సినిమాల్లోని లుక్స్ ఎలా ఉన్నాయి, తర్వాతి సినిమలో లుక్ ఎలా ఉండాలి అని చెక్ చేసుకోవడం కోసం నన్ను నేను గూగుల్ చేసుకుంటుంటాను అని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.. త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ ఈమధ్యే స్టార్ట్ అవ్వగా, వేణు శ్రీరామ్, సుకుమార్ లతోనూ సినిమాలు చెయ్యనున్నాడు బన్నీ.