Allu Arjun : పొలం కోసం తహశీల్దార్ ఆఫీస్ కి ఐకాన్ స్టార్

తాజాగా ఇవాళ ఉదయం అ‍ల్లు అర్జున్‌ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో కనిపించారు. హైదరాబాద్ శివార్లలో శంకర్‌పల్లి మండలంలోని జన్వాడలో బన్నీ రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు.

Allu Arjun : పొలం కోసం తహశీల్దార్ ఆఫీస్ కి ఐకాన్ స్టార్

Allu Arjun

Updated On : October 8, 2021 / 1:34 PM IST

Allu Arjun :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఇవాళ ఉదయం అ‍ల్లు అర్జున్‌ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో కనిపించారు. హైదరాబాద్ శివార్లలో శంకర్‌పల్లి మండలంలోని జన్వాడలో బన్నీ రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్‌ కోసం ఇవాళ ఉదయం బన్నీ శంకర్‌పల్లి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్‌ పనులు పూర్తి అయిన తరువాత ప్రొసీడింగ్‌ ఆర్డర్‌ను శంకర్‌పల్లి తహశీల్దార్‌ సైదులు బన్నీకి అందజేశారు.

Mega Family : మెగా ఫ్యామిలీతో మల్టీస్టారర్ కథని సిద్ధం చేసిన మెగా మేనల్లుడు

తహశీల్దార్ కార్యాలయానికి అల్లు అర్జున్‌ వచ్చాడని తెలుసుకున్న అభిమానులు ఆయనను చూసేందుకు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఎమ్మార్వో, అక్కడి సిబ్బంది, కొంతమంది అభిమానులు బన్నీతో సెల్ఫీలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తైన వెంటనే ఆయన తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘ఫుష్ప’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.