Pushpa 2 collections : బాక్సాఫీస్ వ‌ద్ద పుష్ప రాజ్ రూల్‌.. 14 రోజుల్లో 1508 కోట్లు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది.

Pushpa 2 collections : బాక్సాఫీస్ వ‌ద్ద పుష్ప రాజ్ రూల్‌.. 14 రోజుల్లో 1508 కోట్లు..

Allu Arjun Pushpa 2 Movie 14 Days Collections

Updated On : December 19, 2024 / 8:02 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. తొలి రోజు నుంచే థియేట‌ర్ల వ‌ద్ద రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది. విడుద‌లై 14 రోజులు పూర్తి చేసుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌ద్నాలుగు రోజుల్లో రూ.1508 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

దీంతో భార‌తీయ బాక్సాఫీస్ చ‌రిత్ర‌లో అతి త‌క్కువ స‌మ‌యంలో 1500 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టిన తొలి చిత్రంగా రికార్డుల‌కు ఎక్కింది.

Daaku Maharaaj : బాల‌య్య‌ ‘డాకు మ‌హారాజ్’ నుంచి సెకండ్ సింగిల్..

ఈ విష‌యాన్ని ఓ పోస్ట‌ర్ ద్వారా చిత్ర బృందం తెలియ‌జేసింది. ఈ విష‌యం తెలిసి అల్లు అర్జున్ అభిమానులు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో ర‌ష్మిక క‌థానాయిక‌. ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రల‌ను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు.

Dilruba : ‘క’ స‌క్సెస్ త‌రువాత కిర‌ణ్ అబ్బ‌వ‌రం ‘దిల్ రుబా’.. రిలీజ్ ఎప్పుడంటే?