Pushpa 2 : ఓవర్సీస్ లోనూ పుష్ప 2 ప్రభంజనం.. ఆ సినిమాని కూడా దాటేసిందిగా..

తాజాగా మరో అరుదైన రికార్డు బ్రేక్ చేసింది పుష్ప 2.

Pushpa 2 : ఓవర్సీస్ లోనూ పుష్ప 2 ప్రభంజనం.. ఆ సినిమాని కూడా దాటేసిందిగా..

Allu Arjun Pushpa 2 movie rare record in overseas also

Updated On : December 7, 2024 / 12:18 PM IST

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా మిగిలిన అన్ని భాషల్లో రికార్డ్స్ తిరగరాస్తుంది. పుష్ప 2 విడుదల కాక ముందు నుండే టికెట్ బుకింగ్స్ నుండి విడుదలైన మొదటి రోజు కలెక్షన్స్ వరకు పలువురు పాన్ ఇండియా స్టార్ హీరోల రికార్డ్స్ బ్రేక్ చేసింది.

Also Read : Sandeep Raj : ఘనంగా ఆ నటితో కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ వివాహం.. హాజరైన సినీ ప్రముఖులు..

అయితే తాజాగా మరో అరుదైన రికార్డు బ్రేక్ చేసింది పుష్ప 2. ఈ సారి తెలుగు రాష్ట్రాల్లో కాదు. ఏకంగా నార్త్ అమెరికాలో. ఓవర్సీస్ లో ఓవర్ అల్ గా ఏకంగా 5.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ అందుకొని సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్, మొదటి రోజు కలెక్షన్స్ తో పాటు ఇప్పటి వరకు మొత్తం కలిపి 5.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ అందుకుంది పుష్ప 2. ఈ విషయంలో తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా రికార్డు బ్రక్ చేసింది పుష్ప 2. అయితే నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాస్ అందుకున్న తెలుగు సినిమాల లిస్ట్ లో ముందు బాహుబలి2 20.57మిలియన్ డాలర్లు, రెండో స్థానంలో RRR 14.33మిలియన్ డాలర్లు, మూడో స్థానంలో సలార్ 8.89మిలియన్ డాలర్లు, నాలుగో స్థానములో బాహుబలి 1 8.03మిలియన్ డాలర్లు, ఐదో స్థానంలో హనుమాన్ 5 మిలియన్ డాలర్ల గ్రాస్ అన్ని కలిపి మొదటి రోజు వసూలు చేసాయి.


ఇక ఇప్పుడు పుష్ప 2 ఏకంగా 5.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి హనుమాన్ స్థానాన్ని పొందింది. మరి పుష్ప మొదటి రోజు కలెక్షన్స్ తోనే ఐదవ స్థానాన్ని చేరుకుంది అంటే రాబోయే రోజుల్లో సలార్, బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేసి వాటి స్థానంలో పుష్ప 2 నిలుస్తుందా అన్నది చూడాలి. ఒక తెలుగు సినిమాకి విడుదలైన మొదటి రోజే నార్త్ లో ఇంతటి వసూళ్లు వచ్చాయంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే మొదటి రోజు మొత్తం కలిపి 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది పుష్ప 2. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ అందుకుంటుందో చూడాలి.