Pushpa 2 : పుష్ప 2 టార్గెట్ 1000 కోట్లు కాదా? మరి ఎన్ని కోట్లు? బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే వరల్డ్ వైడ్ ఎంత కలెక్ట్ చేయాలి?

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా 1000 కోట్ల టార్గెట్ పెట్టుకుందని గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తుంది.

Pushpa 2 : పుష్ప 2 టార్గెట్ 1000 కోట్లు కాదా? మరి ఎన్ని కోట్లు? బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే వరల్డ్ వైడ్ ఎంత కలెక్ట్ చేయాలి?

Allu Arjun Pushpa 2 Movie Targets these Records and Collections Details Here

Updated On : December 2, 2024 / 2:38 PM IST

Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా 1000 కోట్ల టార్గెట్ పెట్టుకుందని గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తుంది. అయితే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రకారం అధికారికంగానే టార్గెట్ ఇంకా ఎక్కువ అంట. మూవీ టీమ్ టార్గెట్ కూడా పెద్దదే అని తెలుస్తుంది. పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ ఆల్మోస్ట్ 600 కోట్లకు పైగా అమ్ముడుపోయాయని సమాచారం. అందులో తెలుగు రాష్ట్రాల్లోనే 215 కోట్లకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది.

ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్ గా పుష్ప 2 సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 1200 కోట్ల పైనే గ్రాస్ కలెక్ట్ చేయాలి. అంటే హిట్ అవ్వాలంటే కనీసం 1300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలి. ఈ లెక్కన పుష్ప 2 టార్గెట్ ఆల్మోస్ట్ 1300 కోట్లు ఉంది. అయితే మూవీ యూనిట్ ఇంతకంటే ఎక్కువే టార్గెట్ పెట్టుకున్నట్టు టాలీవుడ్ సమాచారం.

Also Read : Nandamuri Mokshagna : ఫస్ట్ సినిమా మొదలవ్వకుండానే రెండో సినిమా ఓకే చేసిన మోక్షజ్ఞ.. ఇటీవలే పెద్ద హిట్ కొట్టిన డైరెక్టర్‌తో..

ఇప్పటివరకు హైయెస్ట్ కెల్క్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ 2000 కోట్లతో దంగల్ సినిమా ఉంది. రెండో స్థానంలో 1800 కోట్లతో బాహుబలి ఉంది. దీంతో పుష్ప 2 సినిమా ఈ రెండు సినిమాలను టార్గెట్ పెట్టుకుంది. కుదిరితే దంగల్ రికార్డ్ బ్రేక్ చేయాలని లేదా కనీసం బాహుబలి రికార్డ్ అయినా బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేయాలని పుష్ప టీమ్ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. RRR 1300 కోట్ల రికార్డ్ మాత్రం బ్రేక్ చేయడం ఖాయం అని ఫిక్స్ అయిపోయారు.

భారీగా పెంచిన టికెట్ రేట్లు, ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయడం, ఇప్పటికే అదిరిపోయిన అడ్వాన్స్ బుకింగ్స్, వీటికి తోడు బన్నీ పాన్ ఇండియా ప్రమోషన్స్, సినిమా మీద హైప్.. ఇవన్నీ కలిసి పుష్ప 2 సినిమాకు 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ఇస్తాయా చూడాలి.